కొన్ని దినాలుగా హమాస్ ఉగ్రవాద భూభాగంపై దాడి చేస్తున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే.ఇజ్రాయెల్( Israel ) ఆగ్ర జ్వాలాలతో రగిలిపోతున్న సంగతి అందరికీ తెలుసు.
ఉగ్రవాద నేతలు ఏ ప్రాంతంలో ఉన్నా సరే.వారిని వెతికి మరి దాడులు పాల్పడుతున్నారు.ఈ నేపథ్యంలోనే ఎప్పటి నుంచో సవాల్ గా మారిన హిజ్బొల్లా మిలిటెంట్ సంస్థ చీఫ్ సయ్యద్ హసన్ నస్రల్లాను( Syed Hassan Nasrallah ) కూడా మట్టు బెట్టారు.రాజధాని బీరూట్ లో 60 అడుగుల లోతులో ఉన్న బంకర్ లో దాగిన నస్రల్లాను అత్యంత కచ్చితత్వంతో కూడిన దాడులతో హత మార్చారు.
నస్రల్లాను హత్య చెందుకు ఇజ్రాయిల్ ఒక టర్న్ బంకర్ బస్టర్ బాంబులను వాడారు.
ఇకపోతే నస్రల్లాను అంతమొందించి, ఆపరేషన్ ను పూర్తి చేసుకున్న ఇజ్రాయిల్ పైలెట్ కు వైమానిక స్థావరం దాడులు చేసిన పైలెట్ కు స్వాగతం పలికారు.సహచర సైనికులు పాటలు, డ్యాన్సులతో అతడికి స్వాగతం పలికిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా చెక్కర్లు కొడుతుంది.నస్రల్లాను ఈ భూమి మీద లేకుండా చేయడం అనేది ఇజ్రాయిల్ కు ఎంత ముఖ్యమో వారి సంబరాలలో చూస్తుంటే అందరికీ అర్థమవుతోంది.
ఇక ఈ వీడియోను చూసిన కొంతమంది వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
ఇందులో కొందరైతే వీడియో చూస్తే ఇజ్రాయిల్ ఎంతటి దారుణానికైనా పాల్పడే విధంగా కనబడుతుంది అంటూ కామెంట్ చేస్తుండగా.మరికొందరేమో దేశాల మధ్య ఉన్న వైరం ఆ దేశ ప్రజలను సర్వనాశనం చేస్తున్నట్టు మరికొందరు కామెంట్ చేస్తున్నారు.దేశాల మధ్య యుద్ధం వల్ల ఇప్పటికే వేలమంది మరణించారు.
లక్షలమంది నిరాశ్రులయ్యారు.