చుండ్రు సమస్యకు సమర్ధవంతమైన హెర్బల్ ప్యాక్

సాధారణంగా చుండ్రు కనపడగానే ప్రతి ఒక్కరు యాంటీ డాండ్రఫ్ షాంపూలను కొనుగోలు చేసి వాడుతూ ఉంటారు.అయితే అవి కొంతవరకు మాత్రమే పనిచేస్తాయి.

 Dandruff Cure Herbal Pack-TeluguStop.com

తాత్కాలికంగా చుండ్రు తగ్గినా మరల వస్తు ఉంటుంది.ఆలా రాకుండా శాశ్వతంగా చుండ్రును వదిలించటానికి అద్భుతమైన సులభమైన హెయిర్ పాక్స్ ఉన్నాయి.

వాటిని ఉపయోగిస్తే ఫలితం కూడా చాలా తొందరగా వస్తుంది.అయితే ఆ ప్యాక్ తయారుచేయడానికి అవసరమైన వస్తువుల గురించి తెలుసుకుందాం.

ఉసిరిపొడి – ఒక టీస్పూన్
వేపాకులు – 5 నుంచి 6
శీకాకాయి పొడి – ఒక టీస్పూన్
మెంతి పొడి – ఒక టీస్పూన్
రీటా పొడి – ఒక టీస్పూన్
నీళ్లు – ఒక కప్పు

తయారి విధానం

రెండు కప్పుల నీటిలో ఉసిరి పొడి,వేపాకులు,శీకాకాయి పొడి,మెంతి పొడి,రీటా పొడి వేసి పది నిమిషాల పాటు బాగా మరిగించాలి.ఈ నీటిని వడకట్టి తలకు పట్టించి అరగంట తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానము చేయాలి.ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే చుండ్రు సమస్య శాశ్వతంగా వదిలిపోతుంది.

ఈ ప్యాక్ లో యాంటీ ఇంఫ్లమ్మెటరీ,యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉండుట వలన చుండ్రుకి కారణం అయిన బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది.

అలాగే జుట్టుకు మంచి పోషణను అందిస్తుంది.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు