రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఉన్న కొన్ని ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలు బస్సులలో, వ్యాన్ లలో పరిమితికి మించి విద్యార్థులను తీసుకువెళ్లడం జరుగుతుందని అటువంటి పాఠశాలల పై కఠిన చర్యలు తీసుకోవాలని, పరిమితికి నుంచి విద్యార్థులను తరలిస్తున్న స్కూల్, బస్సులను సీజ్ చేయాలని కోరుతూ భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్ ఆధ్వర్యంలో ఆర్టీవో కు మంగళవారం వినతిపత్రం అందించారు.ఈ సందర్భంగా రవి గౌడ్ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా కొన్ని ప్రైవేటు పాఠశాలల బస్సులు ఫిట్నెస్ లేకుండా నడిపిస్తున్నారని,
విద్యార్థులకు ఏదన్న ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు అని అన్నారు.
అలాంటి పాఠశాల యాజమాన్యాల పై చర్యలు తీసుకొని బస్సులలో సీట్లకు మించి ఎక్కువ విద్యార్థులు తీసుకురావద్దని ప్రమాదాలకు గురికాకుండా చర్యలు చేపట్టాలని,ఫిట్నెస్ లేని స్కూల్ వాహనాలను సీజ్ చేయాలని ఈ సందర్భంగా ఆర్టీవోను కోరారు.వినతిపత్రం అందజేసిన వారిలో నాయకులు మట్టె శ్రీనివాస్, నాయకులు కోడి రోహిత్, ఫయాజ్,వినయ్,నవీన్ తదితరులు పాల్గొన్నారు.