యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ( Junior NTR )కు వరుసగా ఏడు సినిమాల విజయాలు అందించిన ఆనందం అంతాఇంతా కాదు.గత పదేళ్లలో ఏకంగా ఇన్ని విజయాలను అందుకున్న హీరో తారక్ కాగా గతేడాది తారక్ నటించిన ఒక సినిమా కూడా థియేటర్లలో విడుదల కాలేదు.
ఇకపై సినీ కెరీర్ కు సంబంధించి అలాంటి తప్పు జరగకుండా తారక్ జాగ్రత్తలు తీసుకుంటూ ఉండటం సోషల్ మీడియా( Social media )లో హాట్ టాపిక్ అవుతోంది.ఏడాదికో సినిమాతో తారక్ అదిరిపోయే ప్లానింగ్ సిద్ధమైందని తెలుస్తోంది.
ఈ ఏడాది దేవర సినిమాతో ముందుకొచ్చిన తారక్ వచ్చే ఏడాది వార్2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కుతుండటంతో ఈ సినిమా రిలీజ్ విషయంలో ఎలాంటి మార్పు ఉండదని చెప్పడంలో సందేహం అవసరం లేదని చెప్పవచ్చు.
2026 సంవత్సరంలో తారక్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ థియేటర్లలో విడుదల కానుంది.2027 సంవత్సరంలో దేవర2 విడుదలయ్యే ఛాన్స్ ఉంది.డైరెక్టర్లు ఎవరైనా తక్కువ సమయంలో సినిమాను తెరకెక్కించే అవకాశం ఉంటే ఆ సినిమాల్లో నటించడానికి తనకు అభ్యంతరం లేదని తారక్ తెలిపారు.జూనియర్ ఎన్టీఆర్ డైరీ మాత్రం ఫుల్ అయిందని చెప్పడంలో సందేహం అక్కర్లేదు.
టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో ప్రభాస్ ( Prabhas )తర్వాత ఆ స్థాయిలో బిజీగా ఉన్న హీరో తారక్ మాత్రమేనని చెప్పడంలో సందేహం అక్కర్లేదు.ఇతర హీరోలకు భిన్నంగా అడుగులు వేయడం తారక్ సక్సెస్ సీక్రెట్ అని చెప్పవచ్చు.అద్భుతమైన స్క్రిప్ట్ లను ఎంచుకుంటున్న తారక్ తన సక్సెస్ తో ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తున్నారు.యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ భారీ సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో బాక్సాఫీస్ ను షేక్ చేయాలని అభిమానులు భావిస్తుండటం గమనార్హం.