జూనియర్ ఎన్టీఆర్( Junior NTR) తన ఎంటైర్ కెరియర్ లో భారీ సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే.ఇక ఇప్పటికే ఆయన చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీలో వరుస సక్సెస్ లను సాధిస్తూ వస్తున్నాయి.
ఇక రీసెంట్ గా ఆయన చేసిన ‘దేవర ‘ సినిమా( Devara movie ) రిలీజ్ అయి వారం రోజులు అవుతున్న నేపథ్యంలో ఈ సినిమా వారం రోజులు 500 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టింది అంటూ సినిమా మేకర్స్ భారీ ప్రచారం అయితే చేస్తున్నారు.
మరి నిజానికి ఈ సినిమాకి అన్ని వందల కోట్లు వసూలు చేసే అంత సత్తా ఉందా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.మరి ఏది ఏమైనా కూడా పబ్లిసిటీ స్టంట్ కోసం వాడిన లేదంటే ఒరిజినల్ గా ఇలాంటి కలెక్షన్స్ వచ్చినా కూడా ఈ సినిమా మాత్రం ఎన్టీఆర్ కెరియర్ లో ఒక మంచి విజయాన్ని సాధించి పెట్టిందనే చెప్పాలి.దాదాపు 250 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా 500 కోట్ల మార్కును దాటి ముందుకు సాగుతూ ఉండడం నిజంగా మంచి విషయమే…ఇక సినిమా యూనిట్ తో పాటు ప్రేక్షకులను కూడా ఈ సినిమా అలరించడంతో ఎన్టీఆర్ అభిమానులు తమ అభిమాన హీరో మరో సక్సెస్ ని సాధించాడు అంటూ సంతోషపడుతున్నారు.
ఇక ఏది ఏమైనప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ వరుసగా ఏడోవ సక్సెస్ ని కూడా సాధించి ఏ హీరోకి సాధ్యం కానీ రీతి లో వరుసగా ఏడు సక్సెస్ లను సాధించిన ఏకైక హీరోగా కూడా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.ఇక ఈ జనరేషన్ లో ఉన్న హీరోలెవరు ఇలాంటి సక్సెస్ లను సాధించకపోవడం విశేషం…చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ సాధిస్తాడు అనేది…
.