మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఘనంగా సన్మానించిన బండలింగంపల్లి రైతులు

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District) ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా బండలింగంపల్లి గ్రామానికి చెందిన జంగ శ్రీకాంత్ రెడ్డిని నియమించడం పట్ల గ్రామ ప్రజలు రైతులు హర్షం వ్యక్తం చేశారు.బండ లింగంపల్లి గ్రామానికి చెందిన జంగా శ్రీకాంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్తగా పనిచేస్తూ గ్రామంలో పార్టీ ఎదుగుదలకు కృషి చేసి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేయడం పట్ల సీనియార్టీని సిన్సియార్టీని గుర్తించి కాంగ్రెస్ ప్రభుత్వం బొప్పాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్గా కల్పించడం జరిగిందన్నారు.

 The Farmers Of Bandalingampally Were Honored By The Director Of The Market Commi-TeluguStop.com

ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ తన పదవికి న్యాయం చేస్తానని, ఒక రైతుబిడ్డగా,రైతుల కష్టాలు తెలిసినవాడిగా రైతుల పక్షాన నిలబడుతానని, రైతులు పండించిన ప్రతి గింజను, కొనుగోలు చేసే విధంగా సహకరిస్తానని అన్నారు.వడ్ల ధాన్యాన్ని నిల్వ చేయడానికి గోదాం నిర్మాణం చేపట్టడానికి కృషి చేస్తానని, విత్తనాలు,క్రిమి సంహారక ఔషధాలను కల్తీ లేకుండా చూస్తానని రైతులకు హామీ ఇవ్వడం జరిగిందన్నారు.

మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా అవకాశం కల్పించిన కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి( KK Mahender Reddy ), కరీంనగర్ పార్లమెంటరీ కో ఇన్చార్జ్ కన్నమేని చక్రధర్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి , బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య, జిల్లా స్థాయి ,మండల స్థాయి నాయకులకు,గ్రామ నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జంగ అంజిరెడ్డి, జంగ నర్సారెడ్డి, కొత్తపల్లి నరసయ్య, బాలచందర్, కొండే విట్టల్ రెడ్డి, జంగ రమేష్ రెడ్డి, జంగ పద్మారెడ్డి,జంగ రాజిరెడ్డి, తడకల దేవరాజ్ , దడిగల పరశురాములు ,మాచర్ల ఎల్లం, రేపాక రాజమల్లయ్య , మార్పు బాల్ రెడ్డి, మార్పు అంజిరెడ్డి, బొడ్డు గాలయ్య, బైరగోని నర్సా గౌడ్, నరేష్ గౌడ్, సాయి గౌడ్, షేక్ ధావలు, షేక్ నజీర్, చింతాకుల పర్యయ్య, సిర్రం సాయిలు, సాకలి చంద్రయ్య, చింతల రాజు , బొడ్డు బాలమల్లు, బందుక ఎల్లయ్య, రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube