జిల్లా ప్రత్యేక అధికారి, వైద్య కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ డైరెక్టర్ ఆర్వీ కర్ణన్ ,సిరిసిల్ల ఐదో వార్డులో ఫ్యామిలీ డిజిటల్ సర్వే పరిశీలన , ప్రభుత్వ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలి ,సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సివిల్ హాస్పిటల్స్ సందర్శన
రాజన్న సిరిసిల్ల జిల్లా: ఫ్యామిలీ డీటెయిల్స్ సర్వే వివరాలు పకడ్బందీగా సేకరించాలని జిల్లా ప్రత్యేక అధికారి, వైద్య కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ డైరెక్టర్ ఆర్వీ కర్ణన్ ఆదేశించారు.రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం మున్సిపల్ ఐదో వార్డులో కొనసాగుతున్న ఫ్యామిలీ డిజిటల్ సర్వేను జిల్లా ప్రత్యేక అధికారి, వైద్య కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ డైరెక్టర్ ఆర్వీ కర్ణన్ శనివారం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా సర్వేలో భాగంగా అధికారులు, సిబ్బంది సేకరిస్తున్న వివరాలు, పత్రాలు పరిశీలించి, పలువురు స్థానికులతో మాట్లాడారు.అధికారులు, సిబ్బంది ప్రతి కుటుంబం వివరాలు తీసుకోవాలని, జనన, మరణ వివరాలు అప్డేట్ చేయాలని సూచించారు.
ఫోటోలు తీసుకోవాలని ఆదేశించారు.
వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలి
ప్రభుత్వ వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రత్యేక అధికారి, వైద్య కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ డైరెక్టర్ ఆర్వీ కర్ణన్(RV Karnan) పేర్కొన్నారు.సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రధాన దవఖానను వైద్య కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ డైరెక్టర్ ఆర్వీ కర్ణన్ శుక్రవారం పరిశీలించేందుకు రాగా, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా(Collector Sandeep Kumar Jha), అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ (Additional Collector Khimya Naik) పుష్పగుచ్చం అందించి, స్వాగతం పలికారు.అనంతరం ఓపీ రిజిస్ట్రేషన్ కౌంటర్ ను పరిశీలించి, రోజూ ఎంత మంది వస్తున్నారో ఆరా తీశారు.
వివరాలు ఆన్లైన్ లో నమోదు చేస్తుండగా పరిశీలించారు.ఆసుపత్రిలోని ఆపరేషన్ థియేటర్, ప్రసూతి విభాగం, బ్లడ్ బ్యాంక్, మేల్ వార్డ్, ఫిమేల్ వార్డ్, డయాలసిస్ వార్డ్ లను పరిశీలించి, రోజు ఎంత మందికి సేవలు అందిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు.
ఇక్కడ సిరిసిల్ల ఆర్డీవో రమేష్, ఎస్ డి సి రాధాభాయ్,జీజీహెచ్ సూపరింటెండెంట్ లక్ష్మీనారాయణ, డిప్యూటీ సూపరింటెండెంట్ సంతోష్, డీ ఎంహెచ్ఓ వసంత రావు, సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ మీర్జా ఫసహత్ అలీ బేగ్ తదితరులు పాల్గొన్నారు.