కుటుంబ సర్వే పకడ్బందీగా నిర్వహిస్తాం:కలెక్టర్

సూర్యాపేట జిల్లా: సూర్యాపేట మున్సిపాలిటీలోని 16వ వార్డు 100 ఫీట్ రోడ్ వద్ద జరుగుతున్న సామాజిక, ఆర్థిక,విద్య,ఉపాధి, రాజకీయ మరియు కుల సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో భాగంగా హౌస్ లిఫ్టింగ్ సర్వే ప్రక్రియను కలెక్టర్ తేజస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సర్వేలో ఏ ఒక్క కుటుంబాన్ని కూడా విడిచిపెట్టవద్దని,అన్ని కుటుంబాలను సమగ్రంగా వివరాలు సేకరణ చేయాలని,ప్రజలు ఎలాంటి అపోహలు పోవద్దని వివరాలు గోప్యంగా ఉంచుతామని, సర్వే నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయడం జరిగిందని ఒక్క ఇంటిని కూడా వదలకుండా ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లు,నియోజకవర్గ ప్రత్యేక అధికారులు నియమించడం జరిగిందని,16 వార్డు నందు 7 బ్లాకులు 1130 గృహాలు,8 మంది ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్,స్పెషల్ అధికారులు నియమించడం జరిగిందని స్పష్టం చేశారు.

 Family Survey Will Be Conducted Under The Arm Collector, Family Survey , Collect-TeluguStop.com

6 తేదీ నుండి 7వ తేదీ వరకు హౌస్ లిఫ్టింగ్ సర్వే చేస్తారని తదుపరి 8వ తేదీ నుండి చేపట్టనున్న సమగ్ర ఇంటిని కుటుంబ సర్వేకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు చేశామని పకడ్బందీగా ఇంటింటి సర్వే నిర్వహించాలని ఇందుకు సంబంధించి ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లు,మండల ప్రత్యేక అధికారులు, నియోజకవర్గ ప్రత్యేక అధికారులను,జిల్లా నోడల్ అధికారిని నియమించినట్లు తెలిపారు.8 నుంచి సమగ్ర ఇంటింటి సర్వే కార్యక్రమం ప్రారంభమవుతుందని ఈ సర్వేలో ప్రతి కుటుంబం బుక్ లెట్ లో పొందుపరిచిన కుటుంబ వివరాలను నమోదు చేస్తారని,ప్రజలు సర్వే సిబ్బందికి సహకరించాలని సూచించారు.

ఫారంలో అడిగిన అంశాల ఆధారంగా అన్ని అంశాలకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుందని సమాచారంలో తప్పులు లేకుండా ఇవ్వాలన్నారు.పూర్తిస్థాయి సమాచారం సర్వేలో ఉంటే అన్నిటికీ ఉపయేగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.

జిల్లాలో 23 మండల మున్సిపాలిటీలు కలిపి మొత్తం 3,57,071 ఇండ్లు ఉన్నాయని,వీటి సర్వే నిమిత్తం 2601 మంది ఎన్యుమరెటర్స్,263 మంది సూపర్వైజర్ లను నియమించడం జరిగిందని తెలిపారు.సర్వే ప్రక్రియకు నియమించిన మండల, నియోజకవర్గ,జిల్లా, ప్రత్యేక అధికారులు, సూపర్వైజర్లకు శిక్షణ ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు.

సర్వే వివరాలను ఏరోజుకారోజు డేటా ఏంట్రి చేయడం జరుగుతుందని అందుకు సంబంధించి డేటా ఏంటి సిబ్బందిని కంప్యూటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.డేటా ఏంట్రి జరిగినప్పుడు ఎన్యుమరెటర్స్ తప్పక ఉండాలని కలెక్టర్ పేర్కొన్నారు.

ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే తీరును పరిశీలిస్తారని ఎలాంటి సమస్య ఉత్పన్నమైన జిల్లా అధికారులు దృష్టికి తీసుకురావాలని తెలిపారు.సర్వేకు ప్రజలు సహకరించాలని సర్వేలో ఎలాంటి అపోహలకు గురి కావద్దని కలెక్టర్ ప్రజలకు సూచించారు.

సర్వే అంతా గోప్యంగా ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆర్డిఓ వేణు మాధవరావు,మున్సిపల్ కమిషనర్ బి.శ్రీనివాస్, ఆర్ఐ శ్రీధర్,స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్ నాయక్, సూపర్వైజర్ ప్రసిద్ధు, ఎన్యుమరెటర్ నాగమణి, అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube