సూర్యాపేట జిల్లా:జిల్లాలో వినియోగదారుల కమిషన్ ద్వారా తరచుగా అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి వినియోగదారులలో చైతన్యం కల్పించాలని అదనపు కలెక్టర్ యస్.మోహన్ రావు అన్నారు.
మంగళవారం కలెక్టరేట్ నందు ప్రపంచ వినియోగ దారుల దినోత్సవం సందర్బంగా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో డి.యస్.ఓ విజయలక్ష్మితో కలసి ఆయన పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కొత్త చట్టం 2019 ద్వారా వినియోగదారులు తమ సమస్యలు దేశంలోని ఎక్కడి నుండైన తెలియ చేస్తే తప్పక పరిష్కారం లభిస్తుందని అన్నారు.
ముఖ్యానంగా వినియోగదారులకు హక్కులు, చట్టాలపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి చైతన్య పరచాలని సూచించారు.అలాగే జిల్లాలో అన్ని నిత్యావసర షాపులు,పెట్రోల్ బంకులలో సంబంధిత అధికారులు తరుచుగా తనిఖీలు చేపట్టి కొలతలు,తుకాలలో మోసాలను అరికట్టాలని సూచించారు.
వినియోగదారుల కమిషన్ కు అందిన వివిధ సమస్యలపై సంబంధిత అధికారులు పూర్తిస్తాయిలో సహకరించాలని అన్నారు.దేశంలో సాంకేతిక పరిజ్ఞానం పెరగడం వలన అమాయక ప్రజలపై మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయని, డిజిటల్ ఫైనాన్స్ పై వినియోగదారులకు కమిషన్ ద్వారా అవగాహన కల్పించాలని అన్నారు.రాష్ట్ర పౌర సరఫరా శాఖ హైదరాబాద్ నందు ప్రభుత్వం ఏర్పాటు చెందిన టోల్ ఫ్రీ నెం.180042500333 అలాగే కేంద్ర ప్రభుత్వ టోల్ ఫ్రీ నెం.18004254000 లకు ఆన్లైన్ షాపింగ్,బ్యాంకింగ్ సేవల్లో అలాగే ఎలక్ట్రానిక్ వస్తువుల కొనుగోలులో జరిగే మోసాలపై తెలియ చేస్తే పరిష్కారం లభిస్తుందని ఈ సందర్బంగా తెలిపారు.అనంతరం డిజిటల్ ఫైనాన్స్ పై వినియోగదారులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు.
ఈ సమావేశంలో డి.యం.రాంపతి,తునికల కొలతల అధికారి వెంకటేశ్వర్లు,ఏ.ఎస్.ఓ పుల్లయ్య,డి.టి.నాగలక్ష్మి, వినియోగదారుల జిల్లా అధ్యక్షులు ప్రేమ్ కుమార్, సూర్యాపేట,తిరుమలగిరి పట్టణ అధ్యక్షులు చెరుకు శ్రీనివాస్,బొల్లేటి రాములు,పౌర సరఫరా శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.