సూర్యాపేట జిల్లా:అంగన్వాడి కేంద్రాలలో ఐదేళ్ల లోపు చిన్నారులకు బడిబాటను పరిచయం చేయడంతో పాటు వారి ఎదుగుదలకు నాణ్యమైన పోషకాహారాలు అందించేందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడి కేంద్రాలను నెలకొల్పి,అందులో టీచర్లతో పాటు పిల్లల ఆలపాలనా చూసేందుకు ఆయాలను కూడా నియమించింది.అయితే సూర్యాపేట జిల్లా అనంతగిరి మండల వ్యాప్తంగా 36 అంగన్వాడి కేంద్రాలకు గాను, 36 టీచర్లు,36 ఆయాలు ఉండాలి.
కానీ,అందులో ఒక సెంటర్లో టీచర్ ను తొలగించగా,35 మంది టీచర్లు ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నారు.రెండు అంగన్వాడి కేంద్రాల్లో అయాలు మృతి చెందగా,మరో ఇద్దరిని వృద్ధులని తొలగించినట్లు సమాచారం.
దీనితో 36 సెంటర్లలో 32 మంది ఆయాలు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు.ఆయాలు లేని సెంటర్లో అంగన్వాడీ టీచర్లు వంటా వార్పూ తామే చేస్తూ చిన్న పిల్లలకు ఆహారాన్ని అందిస్తూ అవస్థలు పడుతున్నారు.
ఒకవైపు పిల్లలకు చదువులు చెబుతూ మరోవైపు వంట చేయాల్సి రావడంతో తమకు ఇబ్బందిగా మారిందని వాపోతున్నారు.ఆయాల కొరత కారణంగా గర్భిణీ స్త్రీలకు,చిన్న పిల్లలకు పౌష్టికాహారాలు అందించాల్సి రావడంతో పిల్లలు చదువుకు దూరమవుతున్నారని, అంగన్వాడి సెంటర్లలో శుభ్రత కూడా కొరవడిందని అంటున్నారు.
దీనితో చదువు చెబుతూ వంట చేస్తూ, పారిశుద్ధ్య పనులు చేస్తూ, గర్భిణీ స్త్రీలకు,బాలింతలకు, పిల్లలకు అన్నిరకాల పౌష్టికాహారాలు అందించడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఆయాలు లేని అంగన్ వాడీ సెంటర్లలో వెంటనే ఆయాలను నియమించి,అంగన్వాడి టీచర్ల పనిభారాన్ని తగ్గించాలని చిన్నపిల్లల తల్లిదండ్రులు, గర్భిణీ స్త్రీలు కోరుతున్నారు.
ఇదే విషయమై అంగన్వాడి సూపర్వైజర్ మంగ ను వివరణ కోరగా అనంతగిరి మండల వ్యాప్తంగా 36 సెంటర్లలో 32 మంది ఆయాలు ఉన్న మాట వాస్తవమే కానీ,ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేస్తే వివిధ అంగన్వాడి కేంద్రాల్లో ఖాళీగా ఉన్న ఆయాలను భర్తీ చేస్తామని అన్నారు
.