సూర్యాపేట జిల్లా:వైయస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి,ప్రజా గాయకుడు,తుంగతుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఏపూరి సోమన్నపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే సైదిరెడ్డి అనుచరుల దాడికి నిరసనగా తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో వైయస్సార్ టిపి తుంగతుర్తి మండల అధ్యక్షులు చింతకుంట్ల పరమేశ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సైదిరెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్యాతిధిగా హాజరైన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ సూర్యాపేట జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు గిలకత్తుల రమేష్ గౌడ్ మాట్లాడుతూ మళ్లీ ఇంకోసారి ఏపూరి సోమన్నపై దాడి చేయాలన్న ఆలోచన చేస్తే తరిమి తరిమి కొడతామని హెచ్చరించారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో మాట్లాడే హక్కుందని,ఎవరు మాట్లాడితే వారిపై దాడులు చేస్తారా అని ప్రశ్నించారు.టీఆర్ఎస్ నాయకులు ఇలాంటి సంస్కృతిని పెంచిపోషిస్తే రాబోయే రోజుల్లో అది వారి మెడకే చుట్టుకుంటుందని,ఎవరు తీసిన గోతిలో వారే పడే రోజులు వస్తాయని చెప్పారు.
ఈ కార్యక్రమంలో వైయస్సార్ తెలంగాణ పార్టీ జిల్లా కార్యదర్శి ధనియాల శంబయ్యనాయుడు,సూర్యాపేట జిల్లా దళిత విభాగం అధ్యక్షుడు చంద్రశేఖర్,తుంగతుర్తి నియోజకవర్గ దళిత విభాగం అధ్యక్షులు సంద వెంకన్న,నియోజకవర్గ నాయకులు సంద రవి,మండల పార్టీ అధ్యక్షులు చింతకుంట్ల పరమేష్,శాలిగౌరారం మండల అధ్యక్షుడు కూటికంటి వెంకన్న,నాగారం మండల ఉపాధ్యక్షులు సైదులు,సాంస్కృతిక విభాగం నాయకులు ఎర్ర అనుదీప్ కుమార్,నియోజకవర్గ నాయకులు పంతం వికాస్,ఉపేందర్,నరేష్,తుమ్మ రామస్వామి,నూతనకల్లు మండల ఉపాధ్యక్షులు గాజుల సురేందర్,పోలేపాక వెంకన్న,చీకటి మల్లయ్య గౌడ్,చామకూరి కుమార్ తదితరులు పాల్గొన్నారు.