సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రానికి చెందిన వి3 న్యూస్ ప్రెజెంటర్ తాటి జ్యోతికి మీడియా ప్రతిభా పురస్కారం అవార్డు లభించింది.ఈ నెల 16న హైద్రాబాద్‌లోని శ్రీ త్యాగరాజ గానసభలో 16 సంవత్సరాలు జర్నలిస్ట్ రంగంలో పూర్తి చేసుకున్న వారికి జీవీఆర్ కల్చరల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవార్డు ప్రధానోత్సవంలో తెలంగాణ టూరిజం కార్పోరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త చేతుల మీదుగా జ్యోతి అవార్డును అందుకున్నారు.
ఈ సందర్భంగా పలువురు జర్నలిస్ట్‌లు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.