ఎడిటర్ గౌతమ్ రాజు..
ఆయన నేటి ఉదయం కన్నుమూశారు.నిజానికి గౌతమ్ రాజుకి, రాజమౌళికి మధ్య ఒక ప్రత్యేకమైన అనుబంధము ఉంది.
అదేంటి, రాజమౌళి అన్ని సినిమాలకు కోటగిరి వెంకటేశ్వరరావు కదా ఎడిటింగ్ బాధ్యతలు తీసుకునేది గౌతమ్ రాజుతో రాజమౌళికి సంబంధం ఏంటి అని అనుకుంటున్నారు కదా ? దాని వెనక ఒక పెద్ద కథ ఉంది.ప్రతి సినిమాకి కూడా కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, హీరో హీరోయిన్స్ ఎంత ముఖ్యమో ఆ సినిమాకి మంచి ఎడిటింగ్ పార్టీ కూడా ముఖ్యమే అందుకే సినిమాకు మంచి ఎడిటర్ కనుక లేకపోతే అది ఖచ్చితంగా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు.
సినిమా హిట్ అయిన ఫట్టైనా దాని వెనకాల ఒక ఎడిటర్ ఖచ్చితంగా మంచివాడై ఉండాలి.
అలాంటి మంచి ఎడిటర్స్ లో గౌతమ్ రాజు కూడా ఒకరు.
ఇక గౌతమ్ రాజు కి రాజమౌళి కి ఉన్న ప్రత్యేక అనుబంధ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.నిజానికి రాజమౌళి మొదట రాఘవేంద్రరావు దగ్గర శాంతి నివాసం అనే సీరియల్ కి దర్శకత్వ బాధ్యతలు చేపట్టాడు.
దాంతో అందరు కూడా రాఘవేంద్ర రావే రాజమౌళికి తొలి గురువు అని అనుకుంటారు.కానీ అంతకన్నా ముందే గౌతమ్ రాజు దగ్గర ఎడిటింగ్ లో మెలకువలు నేర్చుకున్నాడు.
గౌతమ్ రాజుకి అసిస్టెంట్ గా కొన్నాళ్లపాటు పనిచేశాడు రాజమౌళి.దాంతో సినిమాకి ఎక్కడ కట్ చెప్పాలి, ఎక్కడ కట్ చేయాలి, ఏది కత్తెర పడాల్సిన సీన్, సినిమా మొత్తంగా ఎలా ఉండాలి అనే అన్ని మెలకువలు కూడా గౌతమ్ రాజు దగ్గరే శిక్షణ పొందాడు రాజమౌళి.
అలా తొలి గురువుగా గౌతమ్ రాజు ఉంటాడు రాజమౌళికి.

ఇక ఆ తర్వాత తన ఏ సినిమాకి కూడా రాజమౌళి గౌతమ్ రాజుతో పని చేయించుకోలేదు ఎందుకు అంటే తన గురువుతో పని చేయించుకుంటే అజమాయిషి చెయ్యలేననేది రాజమౌళి చెప్పే మాట.ఎందుకంటే ఒక ఎడిటర్ తో దగ్గర ఉండి పని చేయించుకునే క్రమంలో ఎంతో కొంత డిమాండ్ చేయాల్సిన పరిస్థితి కూడా ఎదురవుతాయి.అలాంటప్పుడు తన గురువును తాను డిమాండ్ చేయడం కరెక్ట్ కాదని తన ప్రతి సినిమాకి కూడా కోటగిరి వెంకటేశ్వరరావు చేతనే ఎడిటింగ్ చేయించుకున్నాడు.
ఒక బాహుబలి 2 సినిమా కోసం తమ్మిరాజు కూడా ఒక చెయ్యి వేశాడు.ఆర్ఆర్ఆర్ సినిమా కోసం శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నాడు.ఇలా ఎడిటింగ్ డిపార్ట్మెంట్లోనే కాదు సినిమా విషయంలో రాజమౌళికి గురువుగా గౌతమ్ రాజుని చెప్పుకోవాలి అలా వీరిద్దరికీ మంచి అనుబంధమైతే ఉంది.

అలా రాజమౌళి ప్రతి డిపార్ట్మెంట్ పై పట్టు సాధించి నేటి జక్కన్నగా పేరు గడించుకున్నాడు.ఇక గౌతమ్ రాజు విషయానికి వస్తే 1982లో మొదటిసారిగా చిరంజీవి సినిమాతో తన కెరీర్ ని స్టార్ట్ చేశాడు.నాలుగు స్తంభాలాట సినిమా తన కెరియర్లో మొదటి సినిమా అలా ఆ సినిమా తర్వాత ఏకంగా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో 850 కి పైగా సినిమాలకు ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టి తన ప్రతిభ ఏంటో చూపించుకున్నాడు.
ఇక తెలుగులో అయితే చెన్నకేశవరెడ్డి, ఖైదీ నెంబర్ 150 , గబ్బర్ సింగ్, గోపాల గోపాల, రేసుగుర్రం, కిక్, బలుపు, బద్రీనాథ్ వంటి ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలకి గౌతమ్ రాజు ఎడిటర్ గా పనిచేశాడు.ఇలా ఇప్పుడు గౌతమ్ రాజు కన్నుమూయడంపై పలువురు సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులు తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.