కల్వకుంట్ల కవితకు ఇడి నోటీసులపై మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్...

సూర్యాపేట జిల్లా: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడి నోటీసులు ఇవ్వడం కేంద్ర ప్రభుత్వ దుర్మార్గాలకు పరాకాష్ట అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఫైరయ్యారు.బుధవారం ఆయన జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడుతూ బీజేపీ అధికారాన్ని అడ్డుపెట్టుకుని రాజ్యాంగ సంస్థల దుర్వినియోగం చేస్తోందని,దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేసి ఇచ్చిన నోటీసులు కావని,రాజకీయ దురుద్ధేశం తోటే కవితకు నోటుసులు ఇచ్చారని మండిపడ్డారు.

 Minister Jagadish Reddy Fires On Ed Notices To Mlc Kavitha, Minister Jagadish Re-TeluguStop.com

ఢిల్లీలో ఆప్, ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే కుట్రలో భాగమేనని అన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆత్మస్థైర్యం దెబ్బతీసేందుకే బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, ఇటువంటి పప్పులు ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు ఉడకవని కొట్టిపారేశారు.

నియంతలు ఎప్పుడూ నిలబడ లేదని, బీఆర్ఎస్ ను నిలువరించగలం అనుకుంటున్న వారిది మూర్ఖత్వమని అన్నారు.మోడీ దుర్మార్గాలకు కాలం చెల్లిందని,బీజేపీ సర్కార్ ను గద్దె దింపే వరకు పోరాటం ఆగదన్నారు.కేసులు,జైళ్లు మాకు కొత్త కాదని,ప్రజల కోసం పనిచేసేవారికి ఇవి తప్పవన్నారు.2001 లో రాష్ట్ర సాధన కోసం ఉద్యమం మొదలు పెట్టిన రోజున ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పింది ఇదేననిగుర్తు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube