షుగర్ వ్యాధి.ప్రపంచ వ్యాప్తంగా వయసుతో సంబంధం లేకుండా కోట్లాది మంది దీనికి బాధితులుగా మారారు.
మారుతూనే ఉన్నారు.ఒక్కసారి వచ్చిందంటే జీవిత కాలం వేధించే షుగర్ వ్యాధిని ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రాణాంతకరంగా మారిపోతుంది.
అందువల్లనే షుగర్ వ్యాధిని కంట్రోల్‌లో ఉంచుకోవడం ఎంతో ముఖ్యం.అయితే అందుకు ఇప్పుడు చెప్పబోయే జ్యూస్ అద్భుతంగా సహాయ పడుతుంది.
మరి ఆ జ్యూస్ ఏంటీ.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? మరియు ఏ సమయంలో తీసుకోవాలి.? వంటి విషయాలను ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఒక కప్పు గ్రీన్ బీన్స్‌ను తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.అలాగే హాఫ్ కీరా, హాఫ్ పైనాఫీల్ తీసుకుని ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఇప్పుడు బ్లెండర్‌లో కడిగి పెట్టుకున్న గ్రీన్ బీన్స్, కట్ చేసి పెట్టుకున్న కీరా ముక్కలు, పైనాపిల్ ముక్కలు, రెండు టేబుల్ స్పూన్ల నిమ్మ రసం, కొన్ని పుదీనా ఆకులు, హాఫ్ లీటర్ వాటర్ పోసి గ్రైండ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ గ్రీన్ బీన్స్ జ్యూస్‌ను గ్లాస్‌లోకి సర్వ్ చేసుకుని మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ సమయంలో సేవించాలి.
వారంలో కేవలం మూడు సార్లు ఈ జ్యూస్‌ను తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపు తప్పకుండా ఉంటాయి.షుగర్ వ్యాధి ఉన్న వారే కాదు.ఎవ్వరైనా ఈ జ్యూస్‌ను తీసుకోవచ్చు.

ఈ గ్రీన్ బీన్స్ జ్యూస్‌ను తీసుకోవడం వల్ల జ్ఞాపక శక్తి, ఆలోచనా శక్తి రెండూ పెరుగుతాయి.మతి మరుపు వచ్చే రిస్క్ తగ్గుతుంది.జుట్టుకు మంచి పోషణ అంది ఒత్తుగా, పొడువుగా పెరుగుతుంది.
శరీరంలో క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా ఉంటాయి.వెయిట్ లాస్ అవుతారు.
గుండె ఆరోగ్య వంతంగా మారుతుంది.మరియు చర్మం యవ్వనంగా, కాంతి వంతంగా తయారవుతుంది.