బలూచిస్థాన్( Balochistan ) అనేది పాకిస్థాన్‌లోనే( Pakistan ) అతి పెద్ద రాష్ట్రం.కానీ జనాభా మాత్రం తక్కువే.
చమురు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నా.ఎప్పుడూ ఏదో ఒక అలజడితో అట్టుడుకుతూనే ఉంటుంది.
ఇక్కడి వేర్పాటువాద సంస్థ బలూచ్ లిబరేషన్ ఆర్మీ ( BLA ) మరోసారి రెచ్చిపోయింది.ఏకంగా ప్రయాణికులతో నిండి ఉన్న రైలునే హైజాక్ చేసి రక్తమోడింది.
మొత్తం 440 మంది ప్రయాణికులతో క్వెట్టా నుంచి పెషావర్ వెళ్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్( Jaffer Express ) రైలుని టార్గెట్ చేశారు ఉగ్రవాదులు.పట్టాలు పేల్చి.రైలుని ఆపేశారు.దాంతో ఒక్కసారిగా భయానక వాతావరణం నెలకొన్నది.
సొరంగంలోకి సగం దూరిన రైలు ఆగడంతో ప్రయాణికులు బిక్కుబిక్కుమంటూ చూస్తుండగానే.తుపాకులు పట్టుకుని బోగీల్లోకి చొరబడ్డారు ముష్కరులు.
మొదట మహిళలు, వృద్ధులని వదిలేశారు.ఆ తర్వాత గుర్తింపు కార్డులు చెక్ చేస్తూ సైనికులు, అనుమానం వచ్చిన వాళ్లని పక్కకు లాగి కాల్చి చంపేశారు.కళ్ల ముందే ప్రాణాలు పోతుంటే మిగతా ప్రయాణికులు ప్రాణభయంతో వణికిపోయారు.

“వాళ్లంతా మమ్మల్ని ఒక్కొక్కరిగా బయటకు రమ్మన్నారు.ఏం చేయరని చెప్పారు.కానీ 185 మంది వరకూ బయటకి రాగానే కొందరిని ఎంచుకుని కాల్చేశారు” అంటూ ఆరోజు తను చూసిన భయానక దృశ్యాలను గుర్తు చేసుకున్నాడు ప్రాణాలతో బయటపడ్డ ముహమ్మద్ నవీద్.
మరో ప్రయాణికుడు బాబర్ మసిహ్ తన కుటుంబం ఎలా తప్పించుకుందో చెప్పాడు.“మా కుటుంబ సభ్యులను వదిలేయమని మహిళలు ప్రాధేయపడ్డారు.వాళ్లు సరేనని వెళ్లిపొమ్మన్నారు.వెనక్కి చూడొద్దని వార్నింగ్ ఇచ్చారు.
మేం పరిగెడుతుంటే, మాలాగే చాలా మంది పరిగెడుతున్నారు” అని తెలిపాడు బాబర్.

స్టీల్ వర్కర్ నోమన్ అహ్మద్ మాట్లాడుతూ ఆ రోజు నరకం చూశాడు.“మేం బోగీ తలుపులు వేసుకున్నాం.కానీ వాళ్లు తలుపులు బద్దలు కొట్టి లోపలికి వచ్చారు.
గాయపడిన కొందరు బయటకు రానంటే వాళ్లని అక్కడే కాల్చి చంపేశారు” అంటూ వణికిపోయాడు.
మరోవైపు సైన్యం రంగంలోకి దిగి ఆపరేషన్ స్టార్ట్ చేసి.33 మంది ఉగ్రవాదులనూ మట్టుబెట్టింది.ప్రభుత్వ సమాచార శాఖ మంత్రి అత్తవుల్లా తారర్ ఆపరేషన్ సక్సెస్ అయిందని, పెద్ద ప్రాణ నష్టం తప్పిందని చెప్పారు.
ముఖ్యమంత్రి సర్ఫరాజ్ బుగ్తీ కూడా రెస్క్యూ ఆపరేషన్‌లో ప్రయాణికులు ఎవరూ చనిపోలేదని కన్ఫర్మ్ చేశారు.మొత్తం 21 మంది బందీలను మాత్రం ఉగ్రవాదులు చంపేశారు.
ఖనిజ సంపద ఉన్న బలూచిస్థాన్‌కు ఎక్కువ స్వయంప్రతిపత్తి, వనరుల్లో వాటా కావాలని బలూచిస్థాన్ వేర్పాటువాదులు డిమాండ్ చేస్తోన్నారు.సైన్యం రైళ్లలో వెళ్లడం వల్ల అవి టార్గెట్ అవుతున్నాయి.
అమాయకులపై దాడులతో BLA ప్రజా మద్దతు కోల్పోతుందని నిపుణులు అంటున్నారు.రెస్క్యూ ఆపరేషన్ తర్వాత ప్రయాణికులు సురక్షితంగా ఇళ్లకు చేరుకున్నారు.
ఈ ఘటన బలూచిస్థాన్ ఉగ్రవాద పరిస్థితిని తెలియజేస్తోంది.







