ప్రస్తుతం వైట్ హౌస్‌లో( White House ) సెయింట్ పాట్రిక్స్ డే( St Patricks Day ) వేడుకలు జరుగుతున్నాయి.అందరూ ఐరిష్ సంస్కృతిలో మునిగిపోయారు.
ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్( US President Donald Trump ) అందరి దృష్టినీ తనవైపు తిప్పుకున్నారు.కారణం వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్( Vice President JD Vance ) వేసుకున్న సాక్సులపై కామెంట్ చేయడమే.
ఐరిష్ ప్రధాని మైఖేల్ మార్టిన్‌తో ట్రంప్ మాట్లాడుతుండగా, ఒక్కసారిగా ఆయన చూపులు వాన్స్ సాక్సుల( JD Vance Socks ) మీదకు వెళ్లాయి.78 ఏళ్ల ట్రంప్ వెంటనే వాటిని చూస్తూ, “నాకు ఈ సాక్సులు బాగా నచ్చాయి. ఏంటీ సాక్సులు” అని అడిగేశారు.ట్రంప్ మాటలకు వాన్స్, మార్టిన్ ఇద్దరూ నవ్వేశారు.ట్రంప్ అయితే ఏకంగా తాను కాన్సంట్రేట్ చేయలేకపోతున్నానని నవ్వేశారు.
“నేను సీరియస్‌గా మాట్లాడదామని చూస్తున్నా కానీ వీపీ సాక్సులు చూసి మాత్రం చాలా ఇంప్రెస్ అయ్యా” అంటూ ట్రంప్ నవ్వుతూ కామెంట్ చేశారు.ఆయన ద్రవ్యోల్బణం గురించి మాట్లాడటం మొదలుపెట్టారు.కానీ ఆయన కళ్లు మాత్రం సాక్సుల మీదే ఉన్నాయి.
వాన్స్ వెంటనే స్పందిస్తూ ఐరిష్ అతిథిని గౌరవించడానికే అలా వేసుకున్నానని చెప్పారు.ఆ తర్వాత ఆయన సోషల్ మీడియాలో కూడా ఈ వీడియో క్లిప్‌ను షేర్ చేస్తూ “ట్రంప్ కచ్చితంగా నా సాక్సుల గురించి కామెంట్ చేస్తారని నాకు తెలుసు” అని పోస్ట్ పెట్టారు.
అంతకుముందు మీటింగ్ మొదలవడానికి ముందు రిపోర్టర్లతో వాన్స్ సరదాగా మాట్లాడుతూ ట్రంప్ తన సాక్సులను అప్రూవ్ చేస్తారా లేదా అని డౌట్‌గా ఉందన్నారు.ట్రంప్‌కు సాంప్రదాయ దుస్తులు అంటేనే ఇష్టమని, ఒకవేళ ట్రంప్ ఏమైనా అంటే ఐరిష్ ప్రధాని తనను వెనకేసుకు రావాలని కూడా జోక్ చేశారు.
“అధ్యక్షుడుగారు కాస్త పద్ధతిగా డ్రెస్ వేసుకోవడాన్ని ఇష్టపడతారు.ఒకవేళ ఆయన నా సాక్సులు గమనిస్తే, మీరు నన్ను కాపాడాలి.ఇది ఐరిష్-అమెరికన్ సంబంధాలను బలోపేతం చేయడంలో ముఖ్యమైన భాగం అని చెప్పండి.అందుకే నేను వీటిని వేసుకున్నా అని చెప్పండి” అంటూ వాన్స్ నవ్వేశారు.
సరదాగా సాగిన ఈ సంభాషణ తర్వాత ట్రంప్ సీరియస్‌గా మారిపోయారు.అమెరికా, ఐర్లాండ్ మధ్య వాణిజ్య సంబంధాల గురించి మాట్లాడారు.
యూరోపియన్ యూనియన్‌లో భాగంగా ఐర్లాండ్, అమెరికాను తక్కువగా చూస్తోందని ఆయన కామెంట్ చేశారు.
మార్టిన్ వెంటనే కలుగజేసుకుని యూఎస్-ఐర్లాండ్ వాణిజ్యం రెండువైపులా ఉంటుందని నొక్కి చెప్పారు.
ఐర్లాండ్‌లోని అతిపెద్ద విమానయాన సంస్థలు బోయింగ్ విమానాలను అమెరికా తర్వాత ఎక్కువగా కొనుగోలు చేసేది మేమే అని గుర్తు చేశారు.అంతేకాదు 700కు పైగా ఐరిష్ కంపెనీలు అమెరికాలో వ్యాపారాలు చేస్తున్నాయని, వేల సంఖ్యలో ఉద్యోగాలు కల్పిస్తున్నాయని ఆయన వివరించారు.“ఇది చాలామందికి తెలియని నిజం.ఇది లెక్కల్లో కనిపించదు” అని మార్టిన్ తన వాదనను వినిపించారు.