సాధారణంగా పిల్లలు వేరే లోకంలో ఉంటారు.వాళ్లకు అన్నీ కొత్తగా, వింతగా అనిపిస్తాయి.
సీరియస్ విషయాల్లో కూడా ఫన్నీ పాయింట్లు పట్టేస్తారు.వాళ్లకు చిన్న విషయమే పెద్ద సమస్య అయిపోతుంది.
ఇప్పుడు ఒక బుడ్డోడు చేసిన పని తెలిస్తే మీరూ నవ్వాపుకోలేరు.
అమెరికాలోని విస్కాన్సిన్లో( Wisconsin ) మార్చి 4న ఒక నాలుగేళ్ల పిల్లాడు ఏకంగా 911కి ఫోన్ చేసిండు.
ఎమర్జెన్సీ సర్వీసులకు ఫోన్ చేసి తన తల్లి “బ్యాడ్”గా ప్రవర్తిస్తోందని కంప్లైంట్ ఇచ్చాడు.పోలీసులు ఫోన్ ఎత్తగానే ఆ బుడ్డోడు ఏమన్నాడో తెలుసా? “మా అమ్మని అరెస్ట్ చేయండి ప్లీజ్.తను చాలా నాటీగా ఉంది.” అని చెప్పాడట.పోలీసులు కూడా షాక్ అయ్యారు.
ఫోన్ చేసిన అబ్బాయి ఎక్కడున్నాడో ట్రేస్ చేసి వెంటనే గార్డినియర్, ఓస్టర్‌గార్డ్ అనే ఇద్దరు పోలీసులు హుటాహుటిన ఆ పిల్లాడి ఇంటికి వెళ్లారు.
ఏదో పెద్ద గొడవ జరిగి ఉంటుందని, సీరియస్ సిట్యుయేషన్ అనుకుని వెళ్లారు.

కానీ అక్కడ సీన్ చూసి పోలీసులు అవాక్కయ్యారు.ఆ బుడ్డోడు కంప్లైంట్ చేయడానికి కారణం తెలిస్తే మీరూ నవ్వకుండా ఉండలేరు.అసలు విషయం ఏంటంటే, ఆ పిల్లాడి తల్లి ఐస్ క్రీమ్( Ice Cream ) తింటోందట.
పోలీసులు ఆ తల్లిని( Mother ) “ఏమ్మా ఏం జరిగింది?” అని అడిగితే, “అవును నేను ఐస్ క్రీమ్ తిన్నాను” అని ఒప్పుకుంది.అసలు గొడవ ఇక్కడే మొదలైంది.
ఐస్ క్రీమ్ తనకి ఇవ్వకుండా అమ్మ ఒక్కతే తినేసిందని ఆ బుడ్డోడికి కోపం వచ్చింది.అది అన్యాయం అనిపించింది.
వెంటనే పోలీసులకు ఫోన్ చేసి కంప్లైంట్ ఇచ్చేశాడు.

ముందు మా అమ్మని అరెస్ట్ చేయమన్నాడు( Arrest Mom ) ఆ బుడ్డోడు.కానీ ఆ తర్వాత మనసు మారింది.లేదు లేదు అరెస్ట్ చేయొద్దు అని చెప్పాడు.
పోలీసులు అంతా సర్దుకుపోయింది అని నిర్ధారించుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు.కానీ స్టోరీ ఇక్కడితో అయిపోలేదు.
రెండు రోజుల తర్వాత ఆ పోలీసులు మళ్లీ ఆ బుడ్డోడి ఇంటికి వెళ్లారు.ఊరికే వెళ్లలేదండోయ్.ఆ బుడ్డోడి కోసం ఐస్ క్రీమ్ తీసుకొని వెళ్లారు.పోలీసులు చేసిన ఈ పనికి తల్లి చాలా ఎమోషనల్ అయిపోయిందట.
ఈ స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.కొంతమంది లేని గురించి తెలుసుకొని బాగా నవ్వుకుంటున్నారు.