టాలీవుడ్ ఇండస్ట్రీలో తక్కువ సినిమాలే చేసినా మంచి పాపులారిటీని సొంతం చేసుకున్న హీరోలలో కిరణ్ అబ్బవరం( Kiran Abbavaram ) ఒకరు.“క” సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించిన నేపథ్యంలో కిరణ్ అబ్బవరం పారితోషికం సైతం పెరిగిందని వార్తలు వినిపించాయి.వరుస ప్రాజెక్ట్ లతో కిరణ్ అబ్బవరం కెరీర్ పరంగా బిజీగా ఉండగా ఈరోజు దిల్ రూబా సినిమాతో( Dilruba Movie ) కిరణ్ అబ్బవరం ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
దిల్ రూబా ట్రైలర్ కు ఇప్పటికే ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిందనే సంగతి తెలిసిందే.కిరణ్ అబ్బవరం దిల్ రూబా సినిమాతో సక్సెస్ సాధించారో లేదో ఇప్పుడు చూద్దాం.
కథ :

ఒక వ్యక్తి ఫ్రాడ్ చేయడం వల్ల సిద్దార్థ్ తండ్రి మృతి చెందగా అదే సమయంలో సిద్దార్థ్( Sidharth ) అప్పటికే ప్రేమలో ఉన్న మ్యాగీ(నజియా) కూడా కొన్ని కారణాల వల్ల దూరమవుతుంది.బాధలో ఉన్న సిద్దార్థ్ బెంగళూరుకు వెళ్లగా అకక్డ తనకు అంజలి ( రుక్సార్) తో( Ruqsar ) పరిచయం అవుతుంది.అంజలి మొదట ప్రపోజ్ చేయగా నో చెప్పిన సిద్దార్థ్ ఆ తర్వాత ప్రేమకు అంగీకారం తెలుపుతాడు.
అయితే కొన్ని కారణాల వల్ల అంజలికి సిద్ధూకు మధ్య గ్యాప్ ఏర్పడింది? సిద్ధూ సారీ, థ్యాంక్స్ చెప్పడానికి ఎందుకు ఇష్టపడడు? అలా చెప్పకపోవడం వల్ల కలిగిన నష్టం ఏంటి? అంజలి( Anjali ) సిద్ధూ చివరకు కలిశారా? లేదా? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.
విశ్లేషణ :

టాలీవుడ్ టాలెంటెడ్ హీరోలలో కిరణ్ అబ్బవరం ఒకరు కాగా ఈ సినిమాతో కిరణ్ అబ్బవరం మరోసారి ప్రూవ్ చేసుకున్నారని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు.రుక్సార్ థిల్లాన్( Rukshar Dhillon ) తన పాత్రకు న్యాయం చేయగా నజిగా కొన్ని సీన్లలో బాగానే నటించినా మరికొన్ని సన్నివేశాల్లో మాత్రం పూర్తిస్థాయిలో మెప్పించే విషయంలో ఫెయిల్ అయ్యారని చెప్పడంలో సందేహం అవసరం లేదు.
అయితే స్టోరీ లైన్ ఒకింత కొత్తగానే ఉన్నా సినిమా మాత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా లేకపోవడం గమనార్హం.
దర్శకత్వం విషయంలో జరిగిన పొరపాట్లు ఈ సినిమాకు మైనస్ అయ్యాయని చెప్పవచ్చు.నిర్మాణ విలువలు, ఇతర టెక్నికల్ అంశాలకు పూర్తిస్థాయిలో న్యాయం జరిగినా కథనం విషయంలో న్యాయం జరగలేదు.సామ్ సీఎస్ మ్యూజిక్, బీజీఎం బాగున్నాయి.
బలాలు :
కిరణ్ అబ్బవరం యాక్టింగ్, ఫస్టాఫ్, మ్యూజిక్
బలహీనతలు :
ఆసక్తికర ట్విస్టులు లేకపోవడం, సెకండాఫ్, స్క్రీన్ ప్లే