కాంగ్రెస్ నిరుపేదల పార్టీ...ప్రజలే కాపాడుకోవాలి:బత్తుల లక్ష్మారెడ్డి

నల్లగొండ జిల్లా:నిరుపేదల పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుని కాపాడుకునే బాధ్యత ప్రజలపైనే ఉందని మిర్యాలగూడ మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు.హాథ్ సే హథ్ జోడో యాత్రలో భాగంగా శనివారం ఆరవ రోజు తోపుచర్ల,ఇసుక బావిగూడెం,గండ్రవాని గూడెం,కుక్కడంలో పర్యటించారు.

 Congress Party For The Poor People Should Save It: Battula Lakshmareddy , Battul-TeluguStop.com

ఈ ప్రాంతంలోని ఇటుక బట్టీలకు దగ్గరకు చేరుకొని అక్కడి కార్మికుల సమస్యలను తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటుక బట్టీ కార్మిక కుటుంబాల పిల్లలకు సరైన విద్య, వైద్యం అందించడంతో పాటు కార్మికులకు కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు.

జోడయాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తమ్మడబోయిన అర్జున్, ఎంపీపీ పుట్టల సునిత కృపయ,సైదులు,పోలగాని వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube