జాన్ పహాడ్ దర్గాలో ఉత్తమ్ జన్మదిన వేడుకలు...

సూర్యాపేట జిల్లా: టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, నల్గొండ పార్లమెంట్ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలను పురస్కరించుకొని పాలకవీడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎన్.వి.సుబ్బారావు అధ్వర్యంలో మంగళవారం జాన్ పహాడ్ దర్గాలో ప్రత్యేక పూజలు చేశారు.అనంతరం పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి స్వీట్స్ పంచిపెట్టుకుని సబరాలు జరుపుకున్నారు.

 Mp Uttam Kumar Reddy Birthday Celebrations At Jan Pahad Dargah, Mp Uttam Kumar R-TeluguStop.com

ఈ సందర్భంగా ఎంపిపి భూక్యా గోపాల్ నాయక్ మాట్లాడుతూ నిత్యం ప్రజల కోసం వారి సమస్యల కోసం ఆలోచించే నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అని అన్నారు.

ఆయన మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని,మున్ముందు ఉన్నత పదవులు అధిరోహించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో పాలకవీడు ఎంపిటిసి మీసాల ఉపేందర్,కాంగ్రెస్ నాయకులు బెల్లంకొండ నర్సింహారావు,బానవత్ సైదా నాయక్,రామారావు, అందే రాజు,బుడిగె సైదులు,శ్రీకాంత్,శేషు, కూరపాటి శ్రీనివాస్, పేరూరి నాగయ్య, సైదారావు,దావీదు, మస్తాన్,తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube