కోదాడలో ప్రైవేట్ హాస్పిటల్ సీజ్

సూర్యాపేట జిల్లా:అనుమతులు లేకుండా ఆస్పత్రులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ కోట చలం హెచ్చరించారు.శనివారం కోదాడ పట్టణంలోని పలు ఆసుపత్రులలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కోట చలం ఆధ్వర్యంలోని బృందం తనిఖీలు నిర్వహించారు.

 Private Hospital Siege In Kodada-TeluguStop.com

అనంతరం శ్రీ సాయి దుర్గ ఆస్పత్రిని పరిశీలించి సీజ్ చేశారు.ఈ సందర్భంగా డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ కోట చలం మాట్లాడుతూ ప్రైవేటు రంగంలోని ప్రతి ఆస్పత్రి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని,హాస్పిటల్ ఆవరణలోని ల్యాబ్ కు కూడా అనుమతులు ఉండాలని అన్నారు.

ఆస్పత్రిలో పనిచేసే సిబ్బంది క్వాలిఫైడ్ అయి ఉండాలని తెలిపారు.ఇతర దేశాలలో ఎండి పట్టాలు పొందినవారు ఇక్కడ ఎంబిబిఎస్ తో సమానమని,వారు ఎండి అని బోర్డులు పెట్టుకోవద్దని సూచించారు.

అనంతరం ఆసుపత్రి రికార్డులు పరిశీలించారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ నిరంజన్,డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి,డెమో అంజయ్య,భాస్కర రాజు,భూతరాజు సైదులు,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube