సూర్యాపేట జిల్లా: ఆధార్ కార్డ్ అన్నిటికీ ఆధారంగా మారిన నేపథ్యంలో ప్రతీ ఒక్కరికీ ఆధార్ కార్డు తప్పనిసరైంది.ప్రభుత్వ పథకాలు పొందాలన్నా,ఇతర గుర్తింపు పత్రాలు తీసుకోవాలన్నా,విద్యార్థులకు పై చదువులకు వెళ్లాలన్నా చివరికి ప్రభుత్వ దవాఖానకు పోవాలన్నా,ప్రస్తుతం మహిళలు ఆర్టీసి బస్సు ఎక్కాలన్నా ఆధార్ అవసరం.
ఆధార్ కార్డు, దానికి ఫోన్ నెంబర్ లింక్ ఉండాల్సిందే.ఇంతటి ప్రాధాన్యతను సంతరించుకున్న ఆధార్ కార్డులో మార్పులు చేర్పులు చేసుకోడానికి, కొత్తగా పొందడానికి,ఉన్నా వారు ఫోన్ నెంబర్ లింక్ చేసుకోవాడానికి సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల పట్టణంలో ఆధార్ సెంటర్ లేక పట్టణ ప్రజలతో పాటు పరిసర గ్రామాల ప్రజలు అవస్థలు పడుతున్నారు.
గతంలో గ్రామీణ వికాస్ బ్యాంకులో ఆధార్ సెంటర్ ఉండేది.పలు కారణాలతో ఆధార్ సెంటర్ ను తీసేసారు.ఆధార్ కార్డు కోసం హుజూర్ నగర్, మిర్యాలగూడ తదితర పట్టణాలకు వెళ్లాల్సి వస్తుందని,అక్కడ కూడా ఆధార్ సెంటర్లు ఫుల్ బిజీగా ఉండడంతో ప్రజల ఇబ్బందులు పడుతున్నారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి నేరేడుచర్ల పట్టణంలో ఆధార్ సెంటర్ ను మీఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
దూర ప్రాంతాల హాస్టల్లలో దువుకుంటున్న పిల్లలను తీసుకువచ్చి ఆధార్ అప్డేట్ కోసం వేరే ప్రాంతాలకు వెళ్లి వచ్చేసరికి సమయం వృధా అవుతుందని జంపాల శ్రీనివాస్ అనే సెంట్రింగ్ వర్కర్ ఆవేదన వ్యక్తం చేశారు.ప్రజల సమస్యలు దృష్టిలో ఉంచుకొని అధికారులు వెంటనే ఆధార్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు.