బిఎస్ఎన్ఎల్ ద్వారా ఫైబర్ సేవలు

సూర్యాపేట జిల్లా:భారత ప్రభుత్వ రంగ సంస్థ బిఎస్ఎన్ఎల్లో లోకల్ కేబుల్ టీవీ ఆపరేటర్లను టెలికాం సర్వీస్ ప్రొవైడర్లుగా భాగస్వామ్యం అయ్యేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు ఉమ్మడి నల్లగొండ టెలికాం ఎజిఎం రవిప్రసాద్ అన్నారు.సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బిఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద శుక్రవారం లోకల్ కేబుల్ ఆపరేటర్లతో ఫైబర్ సేవలపై అవగాహన సదస్సు నిర్వహించారు.

 Fiber Services Through Bsnl-TeluguStop.com

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేబుల్ టీవీ ఆపరేటర్లు బిఎస్ఎన్ఎల్ సంస్థతో కలిసి పని చేయాలని అన్నారు.భాగస్వామ్య పద్దతిలో అపరిమిత హైస్పీడ్ ఇంటర్నెట్,వాయిస్ కాల్స్ తో పాటు,ఒటిటి ప్రసారాలు చేస్తామని చెప్పారు.

దేశంలో నమ్మకమైన సంస్ధ విస్త్రతమైన నెట్ వర్క్ కలిగిన బిఎస్ఎన్ఎల్ తో కలిసి పనిచేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ఆసక్తిగల ఆపరేటర్లు తమ పూర్తి వివరాలు సంస్ధకు అందజేయాలని అన్నారు.

ఈ సందర్భంగా కేబుల్ ఆపరేటర్లు ఫైబర్ నెట్ కు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఈ ‌కార్యక్రమంలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ అంజయ్య,సబ్ డివిజినల్ ఇంజనీర్ ప్రవీణ్ రాజు,ఉపేందర్ రెడ్డి,కేబుల్ ఆపరేటర్లు మొయినుద్దీన్,సైదులు,సతీష్,శంకర్,షేక్ మహబూబ్ ఆలి,శ్రీను,రామకృష్ణ,నరసింహ, విజయకృష్ణ,రాంబాబు,బందు సైదులు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube