కృష్ణుడువినాయకుడు సినిమాతో హీరోగా మంచి గుర్తింపు పొందిన నటుడు.అంతకు ముందే హ్యాపీడేస్ సినిమాలో నటించినా.
వినాయకుడు సినిమాతో అద్భుత గుర్తింపు తెచ్చుకున్నాడు.ఆ తర్వాత ఒకటి రెండు సినిమాల్లో నటించిన పెద్దగా గుర్తింపు రాలేదు.
ఆ తర్వాత నెమ్మదిగా వెండి తెరకు దూరం అయ్యాడు.కానీ పలు వివాదాలతో ఆయన వార్తల్లోనే నిలుస్తున్నాడు.
అప్పట్లో తన భూమిని కొందరు రాజకీయ నాయకులు కబ్జా చేసుకున్నారంటూ మీడియా ముందుకు వచ్చాడు.ఆ తర్వాత ఓ అమ్మాయి తనపై ఆరోపణలు చేసిన నేపథ్యంలో మళ్లీ వార్తల్లోకి ఎక్కాడు.
ఆ తర్వాత ఆ అమ్మాయి తనపై అసత్య ఆరోపణలు చేసిందని పోలీసు విచారణలో తేలడంతో ఆయన రిలాక్స్ అయ్యాడు.
తాజాగా కృష్ణుడు మరో వివాదంలో చిక్కుకున్నాడు.
డబ్బులు పెట్టి పేకాట ఆడుతూ అడ్డంగా బుక్కయ్యాడు.ఆయన అరెస్టుకు సంబంధించి సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతుంది.
మియాపూర్ పోలీస్ స్టేషన్ సమీపంలోని శిల్పాపార్క్ విల్లాలో తన మిత్రులతో కలిసి కృష్ణుడు పేకాట ఆడాడట.విషయం తెలుసుకున్న ఎస్వోటీ పోలీసులు అక్కడికి చేరుకున్నారట.

పేకాట ఆడుతున్న కృష్ణుడుతో పాటు పలువురు పలువురిని అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారట.ఈ ఘటన నిన్న అర్థరాత్రి సమయంలో జరిగిందట.అయితే ఈ విషయాన్ని పోలీసులు బయటకు రాకుండా చూస్తున్నట్లు తెలుస్తోంది.కానీ సోషల్ మీడియాలో మాత్రం ఆయన అరెస్టు వార్తలు వస్తున్నాయి.

కృష్ణుడు సినిమా రంగంలో అంతగా రాణించకపోయినా.పలు వివాదాల కారణంగా నిత్యం వార్తల్లో ఉంటున్నాడు.హ్యాపీడేజ్, వినాయకుడు, విలేజ్‌లో వినాయకుడు సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నా ఆ తర్వాత ఆఫర్లు లేక ఇంటికే పరిమితం అయ్యాడు.తాజాగా పేకాట ఆడుతూ అరెస్టు అయ్యాడంటూ వార్తలు రావడం సంచలనం కలిగిస్తుంది.
నిజానికి ఆయన వ్యక్తిగతంగా చాలా కూల్ పర్సన్ అంటారు సినీ జనాలు.అలాంటి వ్యక్తి నిత్యం వార్తల్లోకి రావడం ఆశ్చర్యం కలిగిస్తుంది.
అయితే కృష్ణుడు అరెస్టుపై అఫీషియల్ గా ప్రకటన వచ్చిన తర్వాతే మాట్లాడుతాం అంటున్నారు కొందరు సినీ పెద్దలు.