మృత కణాలు(డెడ్ స్కిన్ సెల్స్) పేరుకుపోయే కొద్ది నిగారింపు తగ్గి చర్మం నిర్జీవంగా మారుతుంది.అందుకే ఎప్పటికప్పుడు డెడ్ స్కిన్ సెల్స్‌ను తొలగించుకోవాలని సౌందర్య నిపుణులు చెబుతుంటారు.
అందుకోసం మార్కెట్‌లో ఎన్నో రకాల స్క్రబ్బింగ్ ప్యాకులు, మాస్కులు, క్రీమ్స్ అందుబాటులో ఉన్నాయి.చాలా మంది వాటినే కొనుగోలు చేసి వాడుతుంటారు.
అయితే వాటి వల్ల ప్రయోజనం ఎంత ఉంటుందో పక్కన పెడితే.ఇప్పుడు చెప్పబోయే ఇంటి చిట్కాతో మాత్రం సహజంగానే మృత కణాలను వదిలించుకుని ముఖాన్ని స్మూత్‌గా మరియు గ్లోయింగ్‌గా మార్చుకోవచ్చు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ఇంటి చిట్కా ఏంటో తెలుసుకుందాం పదండీ.
ముందుగా ఒకటి లేదా రెండు నిమ్మకాయాలను తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి.
వాటికి ఉన్న తొక్కలను వేరు చేయాలి.ఇప్పుడు బ్లెండర్ తీసుకుని అందులో నిమ్మ తొక్కలు, మూడు టేబుల్ స్పూన్ల పెరుగు, రెండు టేబుల్ స్పూన్ల లెమన్ జ్యూస్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో రెండు టేబుల్ స్పూన్ల గోధుమ పిండి, హాఫ్ టేబుల్ స్పూన్ ఆర్గానిక్ పసుపు, వన్ టేబుల్ స్పూన్ తేనె వేసుకుని అన్నీ కలిసేలా మిక్స్ చేసుకోవాలి.

చివరిగా ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ షుగర్‌ను మిక్స్ చేస్తే సరిపోతుంది.ఈ మిశ్రమాన్ని ముఖానికి, కావాలి అనుకుంటే మెడకు పట్టించి వేళ్లతో సున్నితంగా రెండు నుండి మూడు నిమిషాల పాటు స్క్రబ్బింగ్ చేసుకోవాలి.ఆపై పది నిమిషాల పాటు డ్రై అవ్వనిచ్చి.అప్పుడు వాటర్‌తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.ఇలా మూడు రోజులకు ఒకసారి చేస్తుంటే చనిపోయిన చర్మ కణాలు తొలగిపోవడమే కాదు.ముఖం స్మూత్‌గా మరియు గ్లోయింగ్‌గా మారుతుంది.కాబట్టి, ఈ సింపుల్ ఇంటి చిట్కాను తప్పకుండా ట్రై చేసేందుకు ప్రయత్నించండి.