ప్రేమ వివాదంలో యువకుడు మృతి

నల్లగొండ జిల్లా: గుర్రంపోడు మండలం కొప్పోలు గ్రామంలో ఓ యువకుడు హత్యకు గురైన ఘటన సంచలనం రేపింది.కట్టంగూరు మండలం దుగినేపల్లికి చెందిన బొడ్డు సంతోష్( Boddu Santosh ) కు నల్లగొండలో తనతో పాటు ఇంటర్ చదువుకున్న కొప్పొలుకు చెందిన బాలికతో గతంలో ప్రేమ వ్యవహారం సాగింది.

 A Young Man Died In A Love Dispute , Love Dispute, Young Man-TeluguStop.com

ఈ వివాదంలో ఇరువర్గాల తల్లిదండ్రులు గతంలో పంచాయతీ నిర్వహించి పరస్పరం ఒకరి జోలికి మరొకరు రావద్దంటూ తీర్మానించుకున్నారు.యువకుడు తన తల్లిదండ్రులతో పాటు సూరత్ కు కల్లు గీత వృత్తి నిమిత్తం వలస వెళ్లాడు.

గురువారం చండూరు మండలంలో తన బంధువుల ఇంటికి పండుగకు వచ్చిన యువకుడు సంతోష్ యువతీతో ఫోన్లో మాట్లాడగా,ఆమె పిలుపు మేరకు కొప్పోల్ లోని ఆమె ఇంటికి వెళ్ళాడు.ఇది గమనించిన యువతి నాయనమ్మ ఇంటికి గడియ వేసి కుటుంబ సభ్యులకు తెలిపింది.

అనంతరం ఆ యువకుడు మృతి చెందడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube