మోతె మండల కేంద్రం( Mothe Mandal )లోని హుస్సేన్ బాద్ ఫ్లైఓవర్ దగ్గర ఆటోను బస్సు ఢీ కొన్న దుర్ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రూ.20 లక్షల ఎక్స్ గ్రేషియో( Exgratia ) ప్రకటించాలని మునగాల మండలం రేపాల గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త పేరెల్లి బాబు( Perelli Babu ) డిమాండ్ చేశారు.సోమవారం బాధిత కుటుంబాలను పరామర్శించిన అనంతరం ఆయన మాట్లడుతూ రెక్కాడితే గాని డొక్కాడని 6 గురు నిరుపేదలు రోడ్డు ప్రమాదం( Road Accident )లో చనిపోయి వారం రోజులు అవుతున్నా ఇంత వరకు ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాకపోవడం బాధాకరం అన్నారు.ఆ ప్రమాదంలో గాయాల పాలైన ఇద్దరి పరిస్థితి ఇప్పటికీ విషమంగా ఉండి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, మిగతా నలుగురు పాక్షిక దెబ్బలతో బయటపడడం జరిగిందన్నారు.
హాస్పటల్లో చికిత్స పొందుతున్న వారికి ప్రభుత్వమే చికిత్స ఖర్చులు భరించి,మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని,గాయపడిన వారికి రెండు లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియో ప్రకటించాలన్నారు.లేనియెడల మృతుల కుటుంబ సభ్యులతో నిరసన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు.