సూర్యాపేట జిల్లా:జిల్లాలో ఫారెస్ట్ అధికారులకు పోలీసు శాఖ నుండి అండగా ఉంటామని జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ అన్నారు.శనివారం జిల్లా కేంద్రంలోని ఫారెస్ట్ కార్యాలయాన్ని సందర్శించి ఫారెస్ట్ అభికారుల విధినిర్వహలో అండగా ఉంటామని భరొసా కల్పించారు.
ఇటీవల భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అటవీ సంరక్షణ అధికారిని దారుణంగా హతమార్చిన విషయం మనకు తెలిసిందే.ఈ తరుణంలో జిల్లా ఫారెస్ట్ సిబ్బంది భయపడాల్సిన పనిలేదని,డీఎఫ్ఓ సతీష్ బాబు సమక్షంలో సిబ్బందికి భరొస కల్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టపరమైన పనులు చేసేటప్పుడు వెనుకడుగు వేయాల్సిన అవసరం లేదని,మీకు జిల్లా పోలీస్ యంత్రాంగం తోడ్పాటు అందిస్తుందన్నారు.ఈ సందర్భంగా డిఎఫ్ఓ సతీష్ బాబు మరియు ఫారెస్ట్ అధికారులు సిబ్బంది అందరు కుాడా తమ అభిప్రాయాలు పంచుకున్నారు.
డిఎఫ్ఓ మరియు ఫారెస్ట్ సిబ్బంది పిలువకుండానే జిల్లా ఫారెస్ట్ ఆఫీస్ కు వచ్చిన ఎస్పీకి ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సూర్యాపేట డీఎస్పీ పరికె నాగభూషణం,స్పెషల్ బ్రాంచ్ సిఐ శ్రీనివాస్, రుారల్ ఎస్సై సాయిరాం మరియు ఫారెస్ట్ రేంజ్ అధికారులు,బీట్ ఆఫీసర్లు,ఫారెస్ట్ సిబ్బంది పాల్గొన్నారు.