బసవపురం మొదలైన భట్టి పీపుల్స్ మార్చ్ పాదయాత్ర...!

సిఎల్పీ నేత భట్టి విక్రమార్క( CLP leader Bhatti Vikramarka ) చేపట్టిన పీపుల్స్ మార్చ్( People’s March ) పాదయాత్ర గురువారం ఉదయం భువనగిరి మండలం బసవపురం గ్రామం నుంచి ప్రారంభమైంది.బసవపురం గ్రామంలో గ్రామపంచాయతీ కార్మికులు సీఎల్పీ నేత భట్టి విక్రమార్కుని కలిసి గ్రామపంచాయతీ కార్మికుల గురించి అసెంబ్లీలో కొట్లాడని వినతిపత్రం సమర్పించారు.

 Bhatti People's March Padayatra To Basavapuram Etc , Basavapuram, Bhatti People,-TeluguStop.com

ఆలేరు పట్టణంలో ఇటీవల కేటాయించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీలో అవకతవకలు జరిగాయని,ఎమ్మెల్యే గొంగిడి సునీత( Gongidi Sunita ) ఒత్తిడి మేరకు అధికారులు అర్ధరాత్రి డ్రా తీసి బీఆర్ఎస్( BRS ) కార్యకర్తలకు ఇచ్చారని సమంత రెడ్డి ఆధ్వర్యంలో మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి భట్టి విక్రమార్కకి మరో వినతిపత్రం అందజేశారు.దీనిపై ఆయన స్పందిస్తూ మీ సమస్యలను అసెంబ్లీలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారం అయ్యేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

రానున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతీ ఒక్కరికీ న్యాయం జరిగేలా చూస్తామని,అన్ని వర్గాల ప్రజలను వంచిస్తున్న ఈ ప్రభుత్వాన్ని గద్దె దించడమే శాశ్వత పరిష్కారమని అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube