అమ్మాయిలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే ఆకతాయిలు గా మారి పోకిరి చేష్టలతో రోడ్డుపై స్కూల్ కు వెళ్లే మైనర్ బాలికను వేధిస్తే ఇంతకంటే దారుణం మరొకటి ఉండదేమో.సమాజంలో అన్యాయం జరిగితే పోలీసుల వద్దకు వెళ్తారు.
మరి పోలీసులే దారుణాలకు పాల్పడితే ఇక రక్షణ అనేది కరువవుతోంది.ఇలాంటి కోవకు చెందిన ఓ సంఘటన ఉత్తరప్రదేశ్లోని లక్నో( Uttarpradesh Lucknow )లో చోటుచేసుకుంది.
వివరాల్లోకెళితే.లక్నోలోని కాంట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మైనర్ బాలిక( Minor Girl ) ప్రతిరోజు సైకిల్ పై స్కూల్ కు వెళ్తోంది.మహమ్మద్ షహదత్ అలీ అనే పోలీస్ హెడ్ కానిస్టేబుల్ స్కూటీపై వెళుతూ ఆ మైనర్ బాలికను వెంబడించి, మాట్లాడే ప్రయత్నం చేశాడు.పక్కనే ఉన్న మహిళ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం పోలీసు ఉన్నతాధికారుల వద్దకు చేరింది.
నగర డీసీపీ అపర్ణ కౌశిక్ ఆ హెడ్ కానిస్టేబుల్ ను సస్పెండ్ చేస్తున్నట్లుగా తెలిపారు.తర్వాత ఆ హెడ్ కానిస్టేబుల్ పై పోక్సో చట్టం( POCSO Act )తో పాటు మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సైకిల్ పై స్కూలుకు వెళ్తున్న మైనర్ బాలికను వెంబడిస్తున్న హెడ్ కానిస్టేబుల్ ను ఓ మహిళ రోడ్డుపై ఆపి గట్టిగా నిలదీసింది.కానీ హెడ్ కానిస్టేబుల్ పొగరుగా సమాధానం చెప్పడంతో ధైర్యం చేసి ఆ మహిళ వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియా( Social Media )లో అప్లోడ్ చేసింది.ఈ వీడియో వైరల్ కావడంతో, చివరికి విషయం ఉన్నత అధికారుల వద్దకు చేరింది.పోలీసులు కేసు నమోదు చేసి సస్పెండ్ చేయడంపై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సమాజంలో ఇలాంటి పోలీస్ ఉండడం చాలా ప్రమాదమని, ఇటువంటి వారిని కఠినంగా శిక్షించాలని సోషల్ మీడియా వేదికగా అందరూ కోరుకుంటున్నారు.పోలీస్ పై వెంటనే చర్యలు తీసుకోవడంతో యూపీ పోలీసులకు ప్రజలు కృతజ్ఞతలు చెబుతున్నారు.