ఏ సమయంలో ఎలా పూజ చెయ్యాలో మీకు తెలుసా?

హిందూమతంలో ఎన్నో ఆచారాలు, సంస్కృతి సాంప్రదాయాలను అనుసరిస్తూ ఉంటారు.ఆ ఆచారాలను పాటించడం వెనక ఎన్నో కారణాలు ఉన్నాయి.

 Pooja Vidhanam, Pooja Timings, Bramha Murtham, Hindu Rituals,good Results-TeluguStop.com

ముఖ్యంగా మనం దేవునికి పూజ చేసి సిరిసంపదలు కలగాలని, చేసే ప్రతి పనిలో విజయం సాధించాలని దేవుని స్మరిస్తూ పూజ చేస్తూ ఉంటాం.ప్రతి ఒక్క ఇంట్లో ఉదయం లేవగానే పూజ చేస్తూ శుభం కలగాలని ఆ దేవుడిని నమస్కరించుకుంటారు.

అయితే ఏ సమయంలో పూజ చేయడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు? ఆ పూజ ఎలా చేయాలి? అన్న విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.

ప్రతి రోజు ఉదయం లేవగానే చాలామంది భగవంతుని స్మరిస్తూ వారి రెండు అర చేతులను చూసుకొని నమస్కరిస్తూ వారి ప్రతి రోజు దినచర్యను ప్రారంభిస్తూ ఉంటారు.

అందువల్లనే ప్రభాత కాలంలో కరదర్శనం కళ్యాణ ప్రదం అని పెద్దలంటారు.మన పూర్వికులు పూజా విధానాన్ని కొన్ని వర్గాలుగా విభజించారు.వాటిని అనుసరించి వారి పూజా విధానాలను ప్రారంభించేవారు.పూజా విధానానికి అనువైన సమయం బ్రహ్మ ముహూర్తం, మిట్టమధ్యాహ్నం, సంధ్యా సమయం అనే వేళలో పూజలు నిర్వహిస్తూ ఉంటారు.

బ్రహ్మ ముహూర్తం లో పూజ నిర్వహించడం వల్ల మనం అనుకున్న కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతా యి.బ్రహ్మ ముహూర్తం అంటే తెల్లవారుజామున 3:30 నుంచి 5:00 గంటల మధ్య సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు.ఈ సమయంలో మన మనస్సు ఎంతో ప్రశాంతంగా, కల్మషం లేకుండా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ఎటువంటి శుభకార్యమైనా తలపెట్టవచ్చు.అంతే కాకుండా సూర్యుడు ఉదయించే లోపు పూజ ముగించడం వల్ల అన్ని శుభఫలితాలు జరుగుతాయి.

బ్రహ్మ ముహూర్తం పూజలు, జపాలు, హోమాలు నిర్వహించడానికి ఎంతో పవిత్రమైన సమయం అని చెప్పవచ్చు.

మిట్టమధ్యాహ్నం ఎటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించరు.

ఒకవేళ చేయాల్సిన పరిస్థితి ఏర్పడితే మిట్టమధ్యాహ్నం గంట ముందు లేదా గంట తర్వాత పూజలు నిర్వహించవచ్చు.ఉపవాసదీక్షలు చేసే వారు సంధ్యా సమయంలో పూజలు నిర్వహించడం వల్ల శుభం కలుగుతుంది.

సూర్యుడు అస్తమించిన తరువాత, నక్షత్రాలు ఏర్పడకముందు పూజను చేయడం ద్వారా శుభ ఫలితాలను పొందవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube