మీ పర్సులో వీటిని ఉంచుకుంటే మీ జాతకం మారిపోవాల్సిందే..!

సాధారణంగా చెప్పాలంటే మీరు ఉపయోగించే పర్సులో కచ్చితంగా ఉండే వస్తువులు, ఉండకూడని ఉండకూడని వస్తువులేంటో ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే పర్సులో కొన్ని ప్రత్యేకమైన వస్తువులు ఉంచుకుంటే పేదరికం దూరమైపోతుంది.

 If You Keep These In Your Purse, Your Horoscope Will Change..! , Rudraksha , De-TeluguStop.com

అలాగే ధన లాభం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.మీ పర్సులో రుద్రాక్ష( Rudraksha )ను కచ్చితంగా ఉంచుకోవాలి.

ఎందుకంటే దీన్ని పెట్టుకోవడం వల్ల శివ అనుగ్రహం కలిగి మీ పెట్టుబడులలో లాభాలు కలుగుతాయి.

అలాగే కొంత మందికి డబ్బులు ఎన్ని వచ్చినా ఖర్చు అవుతూ ఉంటాయి.వారికి వృధా ఖర్చులు పెరిగిపోయి డబ్బు నిలబడకుండా ఉంటుంది.అలాంటి వారు ఈ నియమాలను కచ్చితంగా పాటించాలి.

ఈ ఖర్చులన్నీ తొలగిపోవాలంటే చిటికెడు బియ్యం తీసుకొని పర్సులో ఉంచుకోవాలి.ఎందుకంటే బియ్యం లక్ష్మీదేవి( Laxmi Devi ) స్వరూపం అలాగే వీటిని మీ పర్సులో పెట్టుకోవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఎప్పుడూ ఉంటుంది.

అలాగే వచ్చిన డబ్బు మొత్తం అసలు నిలవడం లేదు అనుకునే వాళ్ళు ఒక వెండి నాణెం( Silver coin ) తీసుకొని లక్ష్మీదేవి పటం ముందు పెట్టి మీ పర్సులో పెట్టుకున్నట్లయితే మీ డబ్బు రెండింతలు అవుతుందని పండితులు చెబుతున్నారు.అంతే కాకుండా లక్ష్మీదేవి పద్మం లో కూర్చున్న ఫోటో కూడా పర్సులో పెట్టుకున్నట్లయితే ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి.ముఖ్యంగా చెప్పాలంటే ఎవరి దగ్గరైనా అప్పుగా తీసుకున్న డబ్బును పర్సులో అస్సలు పెట్టుకోకూడదు.ఇలా పెట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం మీ పై లేకుండా ఉంటుంది.ఇంకా చెప్పాలంటే చిరిగిన పర్సును ఎప్పుడూ వాడకూడదు.ఇలా వాడి నట్లయితే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని పండితులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube