మనదేశంలో చాలామంది ప్రజలు జ్యోతిష్య శాస్త్రాన్ని ఎక్కువగా నమ్ముతారు.కొంతమంది ప్రజలు వారు చేసే ప్రతి పనిలో ఎంతో జాగ్రత్తగా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చేస్తూ ఉంటారు.
కానీ కొంతమంది దానాలు చేయడంలో మాత్రం ఎలాంటి జాగ్రత్తలను పాటించకుండా ఉంటారు.ఇంట్లో ఏది పడితే అది దానంగా ఇస్తుంటారు.
కానీ ఇలా చేయడం వల్ల దుష్ఫలితాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.మన ఇంట్లో ఉండే వస్తువుల్లో కొన్ని మాత్రం అసలు దానం చేయకూడదు.
అలా చేయడం వల్ల మనకే ఇబ్బందులు ఎదురవుతాయి.
మనం ఏ వస్తువులను దానం చేయకూడదో తెలుసుకోవడం మంచిది.
మన ఇంట్లో ఉండే చీపురు ( Broom ) లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తుంటారు.అలాంటి చీపురునూ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతరులకు అసలు ఇవ్వకూడదు.
ఇలా ఇస్తే మనకే ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి.మన ఇంటికి వచ్చిన చుట్టాలకు చేతుల్లో కొబ్బరి నూనె( Coconut Oil ) వేస్తూ ఉంటాం.
అలా అస్సలు చేయకూడదు.ఒకవేళ అలా చేస్తే లక్ష్మీదేవి ( Lakshmi Devi ) వారితో పాటు బయటికి వెళ్లిపోతుంది.
కత్తులు, సూదులు, చాకులు కూడా ఎవరికి దానం చేయకూడదు.అలా చేస్తే మనకే నష్టాలు సుభవించే అవకాశం ఎక్కువగా ఉంది.ఇంట్లో పాడైపోయిన వస్తువులను కూడా అసలు దానం చేయకూడదు.ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ధన నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది.ఎంత కష్టపడి సంపాదించిన డబ్బు మన చేతులలో అసలు నిల్వదు.కొందరు ఇంట్లో పగిలిపోయిన వస్తువులు,చిరిగిపోయిన దుస్తులను దాచుకుంటూ ఉంటారు.
ఇది కూడా అసలు మంచిది కాదు.పనికిరాని ఏది కూడా ఇంట్లో ఉండకూడదు.ఒకవేళ ఉంచుకుంటే దరిద్రం మన వెంట ఎప్పుడూ ఉంటుంది.అందుకే పగిలిపోయిన వస్తువులు, చిరిగిపోయిన వస్తువులు ఉంటే బయటపడేయడం మంచిది.ఇలా మన ఇంట్లో ఉండే వాటిపై జాగ్రత్తలు తీసుకోకపోతే మనకే ఎన్నో రకాల సమస్యలు ఎదురవుతాయి.