జిగర్ తండా డబుల్ ఎక్స్(Jigarthanda Double X) 2014వ సంవత్సరంలో వచ్చిన జిగర్ తండా సినిమాకు సీక్వెల్ చిత్రంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు (Karthik Subbaraju) దర్శకత్వంలో ఎస్ జె సూర్య (SJ Surya) లారెన్స్ వంటి వారు ప్రధాన పాత్రలలో నటించినటువంటి ఈ సినిమా నవంబర్ 10వ తేదీ విడుదలైంది.
మరి పది సంవత్సరాల తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సీక్వెల్ సినిమా ఎలా ప్రేక్షకులను ఆకట్టుకుంది అసలు ఈ సినిమా కథ ఏంటి అనే విషయానికి వస్తే…
కథ:
1975 సంవత్సరంలో ఒక థియేటర్ దగ్గర ఒక రౌడీ (లారెన్స్)కి( Lawrence ) జరిగిన గొడవ వల్ల తను హీరోగా మారాలి అనుకుంటాడు.ఈయన హీరోగా అవ్వాలి అనుకోవడంతో అక్కడున్నటువంటి వారందరూ నవ్వుతారు అయితే వారందరినీ చూసి తాను ఎలాగైనా వీరికి హీరో అయ్యే గుణపాఠం చెప్పాలి అని అప్పటినుంచి తనని హీరోగా పెట్టి సినిమా చేసే డైరెక్టర్ కోసం వెతుకుతూ ఉంటారు.
మరొక నటుడు ఎస్ జె సూర్య కూడా డైరెక్టర్ అవ్వాలని ఎంతో ఆరాటపడుతూ ఉంటారు ఈ క్రమంలోని వీరిద్దరూ కలిసి సినిమా చేయాలని ప్రయత్నం చేస్తారు.
లారెన్స్ తో సినిమా చేయడం కోసం ఎస్ జె సూర్య ఆలోచనలో పడతారు.
ఈయన ఒక రౌడీతో సినిమా చేస్తే సక్సెస్ అవుతుందా అని ఆలోచిస్తాడు.అయితే ఇది ఒక ఎక్స్పరిమెంట్ గా ఉంటుందని భావించి తనతో సినిమా చేయడానికి ఒప్పుకుంటారు అయితే ఎలాంటి కథతో సినిమా చేయాలని ఆలోచిస్తున్న తరుణంలోనే కొందరు రాజకీయ నాయకుల కారణంగా రౌడీ కాస్త మంచిగా మారిపోతాడు.
ఇక ఇదే కథతో సినిమా చేస్తారు.మరి ఈ సినిమా రిలీజ్ అవుతుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది ఒకవేళ రిలీజ్ అయిన హీరోగా ఆ రౌడీ అందరినీ మెప్పించారా అన్నదే ఈ సినిమా కథ అంశం.
నటీనటుల నటన:
ఇక లారెన్స్ నటన( Lawrence Acting ) గురించి మనం చెప్పాల్సిన పనిలేదు ఈయన తన నటన ద్వారా అందరిని మెప్పించారు.ఇక ఎస్ జె సూర్య కూడా ఎంతో అనుభవం ఉన్నటువంటి నటుడు కావడంతో ఈయన కూడా తన పాత్రకు పూర్తిగా న్యాయం చేశారు.నవీన్ చంద్ర( Naveen Chandra ) కూడా అద్భుతమైన పాత్రలో తన పరిధి మేరకు నటించాడు.ఇక నిమిష సజయాన్ కూడా తన పాత్రలో ఒదిగిపోయి నటించింది… ఇక ఇతర తారాగణం కూడా వారి పాత్రలకు వారు న్యాయం చేశారని చెప్పాలి.
టెక్నికల్:
స్టోరీ పెద్దగా లేనప్పటికీ స్క్రీన్ ప్లే( Screenplay ) గాని ఈ సినిమాని డైరెక్టర్ నడిపించిన విధానంగాని చాలా బాగున్నాయి అనే చెప్పాలి.ఇక ఈ సినిమాలో కొన్ని కొన్ని మైనర్ డీటెయిల్స్ కూడా డైరెక్టర్ చాలా అద్భుతంగా చూపించారు.మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ( Music Director Santosh Narayana ) కూడా సాంగ్స్ కొద్దిపాటిగా అలరించినప్పటికీ బిజిఎం కూడా సినిమాకి వన్ ఆఫ్ ద ప్లస్ పాయింట్ అయ్యింది.తిరు సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది.
ఎడిటింగ్ కూడా చాలా బాగుంది.
విశ్లేషణ:
ఈ సినిమా కథ ఏం లేకున్నా కథాంశంతో సినిమాని నడిపించాడు.ముఖ్యంగా కొన్ని మేజర్ ఎలిమెంట్స్ లో అంటే లారెన్స్ పొలిటిషన్ ని ఎదుర్కునే సీన్స్ బాగున్నాయి అనిపించింది.మొత్తానికి ఒక మంచి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు అయితే సినిమాలో అక్కడక్కడ కొన్ని బోర్ కొట్టే సన్నివేశాలు చిన్నచిన్న రిమార్కులు కూడా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్:
లారెన్స్, ఎస్ జె సూర్య యాక్టింగ్. మ్యూజిక్, డైలాగ్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి.
మైనస్ పాయింట్స్:
కథలో డెప్త్ లేకపోవడం ఎంతసేపు అవే క్యారెక్టర్స్ ని చూస్తూ ప్రేక్షకుడు నిరుత్సాహానికి గురవుతాడు.కొన్ని సీన్స్ లాగ్ అయ్యాయి.
బాటమ్ లైన్:
జిగర్ తండా సినిమా స్థాయిలో కాకపోయినా ఈ సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించిందని చెప్పాలి ఒకసారి వినోదాత్మకంగా ఈ సినిమాని చూడొచ్చు కానీ మరీ మరీ చూడాలి అంటే బోర్ అనే చెప్పాలి.