తెలంగాణ పోలింగ్( Telangana Polls ) ప్రశాంతంగా ముగిసింది.కొన్నిచోట్ల ఈవీఎంలు మొరాయించిన.
వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు.ఉదయం 7 గంటల నుండి సాయంత్రం వరకు పోలింగ్ సాగింది.
అయితే ఈసారి అంతగా పోలింగ్ శాతం నమోదు కాలేదని వార్తలు వస్తున్నాయి.ముఖ్యంగా హైదరాబాద్ లో( Hyderabad ) అత్యల్పంగా నమోదయింది.
ఈ క్రమంలో దీనికి గల కారణాలపై సోషల్ మీడియాలో రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.తాజాగా టాలీవుడ్ డైరెక్టర్ హరీష్ శంకర్( Director Harish Shankar ) హైదరాబాద్ లో అత్యల్పంగా ఓటింగ్ శాతం నమోదు అనే విషయంపై స్పందించారు.“వీకెండ్ ముందు పోలింగ్ ఉంది.
దీంతో శుక్రవారం లాంగ్ లీవ్ పెట్టేసుకుని లాంగ్ వీకెండ్ ప్లాన్ చేసుకునే చాలామంది అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్లారు” అంటూ ట్విట్టర్ లో హరీష్ శంకర్ తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు.డైరెక్టర్ హరీష్ శంకర్ ఉదయమే తన ఓటు హక్కు వినియోగించుకుని.ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది.
తెలంగాణ ఏర్పడిన తర్వాత చాలా తక్కువ ఓటింగ్ హైదరాబాద్ లో ఈసారి నమోదు కావటం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.పరిస్థితి ఇలా ఉంటే ఈసారి ఎవరు అధికారంలోకి వస్తారన్నది ఉత్కంఠ భరితంగా మారింది.
చాలావరకు ఎగ్జిట్ పోల్స్ లలో కాంగ్రెస్ పార్టీకి( Congress ) అనుకూలంగా ఫలితాలు వస్తున్నాయి.మరోపక్క హంగ్ కూడా ఏర్పడే అవకాశం ఉందని అంటున్నారు.మరి తెలంగాణ ప్రజలు ఏ పార్టీని ఆదరించారో చూడాలి.