తెలంగాణ రాష్ట్రం( Telangana state )లో తొమ్మిది మంది ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు.హనుమకొండ అడిషనల్ కలెక్టర్ గా రాధిక గుప్తా, ములుగు అడిషనల్ కలెక్టర్ గా పి.
శ్రీజ, నిర్మల్ అడిషనల్ కలెక్టర్ గా ఫైజాన్ అహ్మద్, భూపాలపల్లి కధిరవన్, సిరిసిల్ల పి.గౌతమి, జనగమ లలిత్ కుమార్, మహబూబ్ నగర్ శివేంద్ర ప్రతాప్, మహబూబాబాద్ లెనిన్ వత్సాల్ నియమితులయ్యారు.తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజాప్రతినిధుల తొలగింపు మరియు ప్రభుత్వం ఉన్నతాధికారుల బదిలీల పరంపర కొనసాగుతూ ఉంది.
ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి( Revanth Reddy ) తీసుకుంటున్న అనేక నిర్ణయాలు తెలంగాణ రాజకీయాలలో సంచలనాలు సృష్టిస్తున్నాయి.గత ప్రభుత్వం నియామకాలను రద్దు చేస్తూ తనదైన శైలిలో.నిర్ణయాలు తీసుకుంటున్నారు.
ఈ క్రమంలో గురువారము పలువురు ఐఏఎస్ లను బదిలీ చేయడం జరిగింది.ట్రాన్స్ కో, జెన్ కో… సహా వివిధ శాఖలకు చెందిన పలువురు అధికారులకు స్థానాచలనం కల్పించారు.
ఇక ఇటీవలే.రాష్ట్ర సర్వీసులోకి వచ్చిన ఐఏఎస్ ఆఫీసర్ ఆమ్రపాలి( Amrapali IAS )ని హెచ్ ఎండీఏ జాయింట్ కమిషనర్ గా కాంగ్రెస్ ప్రభుత్వం నియమించింది.
డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇంచార్జీ ఎండిగా.కూడా ఆమ్రపాలికి అదనపు బాధ్యతలు కేటాయించడం జరిగింది.
ఈ క్రమంలో శుక్రవారం రాష్ట్రంలో 9 మంది ఐఏఎస్ అధికారులను ఉన్నచోట నుంచి మరొక చోటికి బదిలీ చేయటం సంచలనంగా మారింది.