దేశంలో మరో రెండో నెలలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికలలో గెలవడానికి జాతీయ పార్టీలు రకరకాల వ్యూహాలతో సిద్ధమవుతున్నాయి.
కాంగ్రెస్ పార్టీ “ఇండియా” అనే కూటమి ఏర్పాటు చేయటం జరిగింది.ఈ కూటమిలో మొదట చేరిన తృణమూల్ కాంగ్రెస్( Trinamool Congress ) తర్వాత కూటమి నుండి కొద్ది రోజుల క్రితం బయటకు వచ్చేయడం జరిగింది.
తాజాగా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీపై సీరియస్ గా చేశారు.రానున్న సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 40 స్థానాలు కూడా గెలవదని అది కూడా అనుమానమేనని అన్నారు.
శుక్రవారం బెంగాల్ లో ముర్షిదాబద్ జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు.
వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ 300 సీట్లలో పోటీ చేసిన కనీసం 40 స్థానాలు గెలవడం అనేది అనుమానమే.అటువంటిది మీకెందుకు ఇంత అహంకారమని మమతా బెనర్జీ నిలదీయడం జరిగింది.భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా బెంగాల్లో అడుగుపెట్టిన రాహుల్ గాంధీ( Rahul Gandhi ) తనకి సమాచారం కూడా ఇవ్వలేదని అన్నారు.
ప్రభుత్వ యంత్రాంగం నుంచి తనకు ఈ విషయం తెలిసిందని దీదీ వ్యాఖ్యానించారు.అంతేకాదు యూపీ, రాజస్థాన్ రాష్ట్రాలలో కాంగ్రెస్ గెలిచే పరిస్థితి లేదని అన్నారు.ఇదే సమయంలో వారణాసిలో గెలిచి దమ్ముంటే మీ పార్టీ సత్తా నిరూపించాలని కాంగ్రెస్ పార్టీకి మమతా బెనర్జీ( Mamata Banerjee ) సవాల్ చేశారు.