కౌంటింగ్ రోజు అప్రమత్తంగా ఉండాలంటూ చంద్రబాబు పిలుపు..!!

ఏపీ ఎన్నికల ఫలితాలు జూన్ 4వ తారీఖు రాబోతున్నాయి.ఈసారి ఎన్నికలలో ఎవరు గెలుస్తారు అన్నది ఆసక్తికరంగా ఉంది.

 Chandrababu Call To Be Alert On The Day Of Counting Chandrababu, Ap Election Res-TeluguStop.com

ఏపీలో అనేక పార్టీలు పోటీ చేసిన టీడీపీ( TDP ) కూటమి.వైసీపీ పార్టీల మధ్య పోటీ నెలకొంది.

ఈసారి ఏకంగా 80 శాతానికి పైగానే పోలింగ్ నమోదు అయ్యింది.కౌంటింగ్ కి వారం రోజులు మాత్రమే సమయం ఉండటంతో తెలుగుదేశం అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇటీవల విదేశాల నుండి వచ్చిన చంద్రబాబు( Chandrababu) గురువారం పార్టీ నాయకులతో సమావేశం కావడం జరిగింది.ఈ సందర్భంగా వైసీపీ నాయకులు అప్పుడే ఓటమికి కారణాలు వెతుక్కుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ క్రమంలో ఎలక్షన్ కమిషన్ మరియు పోలీసులపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.గురువారం పార్టీ ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు.జూన్ మొదటి తారీఖున జోనల్ స్థాయిలో కౌంటింగ్ ఏజెంట్లకు శిక్షణ ఇవ్వాలి.పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై వైసీపీ చేస్తున్న రాద్ధాంతం పట్ల కౌంటింగ్ రోజున అప్రమత్తంగా ఉండాలి.

అని సూచించారు.అటు శుక్రవారం పార్టీ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లతో చంద్రబాబు భేటీ కానున్నరు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈసారి జరిగిన ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి.రూరల్ ప్రాంతాలలో అదేవిధంగా మహిళలు అధిక సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది.

గతంలో కంటే ఎక్కువ శాతం పోలింగ్ నమోదు కావడంతో ప్రభుత్వ వ్యతిరేకత కారణంగా ఓట్లు గట్టిగా పడ్డాయని తెలుగుదేశం భావిస్తుంది.దీంతో కచ్చితంగా తామే గెలుస్తామని టీడీపీ నాయకులు అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube