జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ ఎంపీ మర్గాని భరత్ సెటైర్ లు వేశారు.2014 ఎన్నికలలో జనసేన, బీజేపీ, టీడీపీ మూడు పార్టీలు కలిసి పోటీ చేయడం జరిగింది.అయితే అప్పట్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్రానికి అన్యాయం చేసిందని పవన్నే అన్నారు.రాష్ట్రంలో లోకేష్ అంత అవినీతిపరుడు మరొకరు లేరని కూడా చెప్పారు.మళ్లీ ఇప్పుడు ఏ రకంగా ఆ రెండు పార్టీల మధ్య సయోధ్య కుదిరింది అని ఎంపీ మర్గాని భరత్ ప్రశ్నించారు.పవన్ కళ్యాణ్ ఎన్డీఏ లో ఉన్నారు.
తెలంగాణలో బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు.కానీ ఆంధ్రాలో తెలుగుదేశం పార్టీతో పవన్ పొత్తు పెట్టుకున్నారు.
టీడీపీ.ఎన్డీఏలో ఉందా అని మర్గాని భరత్ ప్రశ్నల వర్షం కురిపించారు.
పవన్ కళ్యాణ్ కి పొత్తుల విషయంలో అసలు ఏ రకమైన నైతికత ఉంది అనేది ప్రజలు కూడా ఆలోచించాలని సూచించారు.మా ప్రభుత్వంలో ప్రజలకు అనేక మేలులు చేశాం.గత ప్రభుత్వ హయాంలో ప్రజలకు ఏ మంచి జరిగింది అంటూ ఎంపీ భరత్ ప్రశ్నించారు.గత ప్రభుత్వంలో ప్రజలకు జరిగిన మంచి చెప్పుకోవడానికి ఏమీ లేదు.అంతా కూడా స్కాములే అని అన్నారు.అందుకే స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో 50 రోజులకు పైగా ఉన్నారు.
నిజంగా ఆయన అవినీతి చేయకపోతే జైల్లో ఎందుకుంటారు.అని ప్రశ్నించారు.
కేసులో అవినీతి జరగకపోతే బెయిల్ వచ్చేది.క్వాష్ పిటిషన్ లో అనుకూలమైన తీర్పు వచ్చేది.
అవినీతి జరిగింది కాబట్టే న్యాయస్థానాలలో సైతం బెయిల్ దొరకని పరిస్థితి నెలకొంది అని.ఎంపీ మర్గాని భరత్ వ్యాఖ్యానించారు.