జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాసు( Janasena Glass Symbol ) అని అందరికీ తెలుసు.2019 ఎన్నికలలో ఈ గుర్తు తోనే పోటీ చేయడం జరిగింది.ఆంధ్రప్రదేశ్ లో 137 స్థానాలు తెలంగాణలో ఏడు పార్లమెంటు స్థానాలలో జనసేన అభ్యర్థులు పోటీ చేశారు.అయితే ఈ ఏడాది మే నెలలో కేంద్ర ఎన్నికల సంఘం జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తును తొలగించింది.
దేశవ్యాప్తంగా 26 రాష్ట్రాలలో గుర్తింపు పొందిన పార్టీల వివరాలను ప్రకటిస్తూ… జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాసు కోల్పోయినట్లు ప్రకటించింది.అంతేకాదు ఈ గుర్తును ఫ్రీ సింబల్ చేస్తున్నట్లు కూడా అప్పట్లో ఎన్నికల సంఘం ప్రకటన చేయడం జరిగింది.
అయితే తాజాగా మళ్లీ కేంద్ర ఎన్నికల సంఘం గాజు గ్లాసు గుర్తును జనసేన పార్టీకి కేటాయించడం జరిగింది.ఈ క్రమంలో పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఎన్నికల సంఘానికి అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు.ఇదిలా ఉంటే జనసేన పార్టీ గాజు గ్లాసు గుర్తుపై వైసీపీ మంత్రి అంబటి రాంబాబు( YCP Minister Ambati Rambabu ) ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు.“మళ్లీ గ్లాసు గుర్తు ఎందుకు సైకిలే తీసుకుంటే పోలా”.అని వ్యంగ్యంగా పోస్ట్ పెట్టారు.వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ( Telugu Desam Party )తో కలిసి పోటీ చేయబోతున్నట్లు పవన్ ప్రకటించడంతో.దాన్ని ఉద్దేశించి మంత్రి అంబటి రాంబాబు ఈ రీతిగా స్పందించినట్లు తెలుస్తోంది.