రేపు క్రిస్మస్ పండుగ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )సోషల్ మీడియా ద్వారా క్రిస్మస్ శుభాకాంక్షలు ( Merry Christmas )తెలియజేశారు.ప్రేమ, కరుణ, క్షమాగుణాలను తన జీవిత సందేశంగా మానవాళికి అందించిన ఏసు క్రీస్తు జన్మించిన పర్వదినం క్రిస్మస్.
ఈ పవిత్ర పండుగ తరుణాన క్రైస్తవ మత ఆరాధకులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు.సామాజిక విలువలు చైతన్యవంతం కావాలంటే క్రీస్తు బోధించిన శాంతి, సహనం, ఔదార్యం సర్వదా ఆచరణీయం.
ప్రతి మనిషీ ఎంతో కొంత పరోపకార గుణం అలవరుచుకోకపోతే జీవితానికి అర్ధం ఉండదని క్రైస్తవం బోధిస్తుంది.ఈ క్రిస్మస్ పర్వదినాన దేశ ప్రజలందరూ శాంతి, సౌభాగ్యాలతో విలసిల్లాలని కోరుతూ నా పక్షాన, జనసిన శ్రేణుల పక్షాన మనసారా కోరుకుంటున్నాను.
అని పవన్ పోస్ట్ పెట్టడం జరిగింది.
ఇదిలా ఉంటే జనసేన( Janasena ) పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సతీమణి శ్రీమతి అనా క్రిస్మస్ వేడుకలను అనాధల మధ్య జరుపుకున్నారు.ఆదివారం ప్రీ క్రిస్మస్ వేడుకలను అనాధ శరణాలయంలో నిర్వహించారు.హైదరాబాద్ బాలాజీ స్వర్ణపూరి కాలనీలో ఉన్న జీవోదయ హోం ఫర్ ద చిల్డ్రన్ ( Jivodaya Home for the Children )లోని చిన్నారులతో ముచ్చటించి వారి విద్యాబుద్ధుల గురించి శ్రీమతి అనా తెలుసుకోవడం జరిగింది.
అనంతరం క్రిస్మస్ కేక కట్ చేయడం జరిగింది.ఇక ఇదే సమయంలో నిత్యవసర సరుకులను కూడా అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా అనాధ శరణాలయం నిర్వాహకులు పవన్ సతీమణి శ్రీమతి అనానీ సత్కరించడం జరిగింది.