దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరిపై( Denduluru MLA Abbaya Chowdary ) చంద్రబాబు సీరియస్ వ్యాఖ్యలు చేశారు.మంగళవారం దెందులూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
దెందులూరును దందాలు ఊరుగా మార్చేశారని అన్నారు.పేకాట, కోడిపందాలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు.
అలాగే పోలవరం కాలువ గట్లను తవ్వేస్తున్నారని మండిపడ్డారు.నియోజకవర్గాన్ని ఏమైనా అభివృద్ధి చేశారా.? అని ప్రజలను చంద్రబాబు( Chandrababu ) ప్రశ్నించారు.తాము అధికారంలోకి రాగానే వ్యవసాయానికి 9 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు.అంతేకాకుండా.‘పశువులు, దాణా, మందుల కొనుగోళ్లపై సబ్సిడీ ఇస్తాం.గోపాలమిత్రలను మళ్లీ నియమిస్తాం’ అని తెలిపారు.అలాగే కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకూ పథకాలు అమలు చేస్తామన్నారు.
సుప్రీంకోర్టు తీర్పు మేరకు అంగన్వాడీలకు( Anganwadis ) గ్రాట్యుటీ, ఆశావర్కర్లకు కనీస వేతనం పెంచుతామని చెప్పారు.ప్రజలకు న్యాయం చేయాలనే ఆలోచన ఉన్న వ్యక్తి జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) అని చంద్రబాబు నాయుడు అన్నారు.కేంద్రం సహకారం మనకు ఉందని, ప్రధాని నరేంద్ర మోదీ( PM Narendra Modi ) 2047కి మన దేశాన్ని ప్రపంచదేశాల్లో నెంబర్ వన్ స్థానంలో ఉంచుతారని అన్నారు.అదే 2047 నాటికి తెలుగు జాతి అగ్రజాతిగా ఉంచాలనేది తన ఆకాంక్ష అని చంద్రబాబు పేర్కొన్నారు.
దెందులూరు నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరఫున చింతమనేని ప్రభాకర్ పోటీ చేస్తున్నారు.గతంలో 2009, 2014 ఎన్నికలలో గెలవడం జరిగింది.2019 ఎన్నికలలో ఓడిపోయారు.దీంతో ఈసారి ఎన్నికలలో కచ్చితంగా గెలవాలని చింతమనేని గట్టిగా కష్టపడుతున్నారు.