హరిహర వీరమల్లు సినిమా( Hari Hara Veeramallu Movie ) నుంచి టీజర్ రిలీజ్ కానుందంటూ తాజాగా వెలువడిన ప్రకటన పవన్( Pawan Kalyan ) అభిమానులతో పాటు సాధారణ అభిమానులను సైతం సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది.అయితే టీజర్ రిలీజ్ అంటూ విడుదల చేసిన పోస్టర్ లో క్రిష్( Director Krish ) పేరు లేకపోవడం షాక్ కు గురి చేస్తోంది.
ఇప్పటివరకు హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించి షూట్ చేసిన ఫుటేజ్ ను క్రిష్ తెరకెక్కించారు.
దర్శకుడిని మార్చేయాలనే అభిప్రాయం ఉన్నా ఇప్పటివరకు ఈ సినిమా కోసం పని చేసిన క్రిష్ కు గుర్తింపు ఇవ్వకపోవడం ఎంతవరకు కరెక్ట్ అనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
క్రిష్ పై కోపం ఉంటే మరో విధంగా చూపించాలే తప్ప చూపించే విధానం కరెక్ట్ కాదని కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం.హరిహర వీరమల్లు పోస్టర్ లో పేరు లేకపోవడం గురించి క్రిష్ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.
క్రిష్ ఈ ప్రాజెక్ట్ కు పూర్తిస్థాయిలో దూరమైనట్టేనని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.హరిహర వీరమల్లు మిగతా భాగాన్ని ఎప్పటికి పూర్తి చేస్తారో ఎవరు షూట్ చేస్తారో తెలియాల్సి ఉంది.హరిహర వీరమల్లు సినిమా పాన్ ఇండియా మూవీగా( Pan India Movie ) రిలీజ్ కానుండగా ఈ సినిమా కోసం అభిమానులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.పవన్ పారితోషికం కూడా భారీ స్థాయిలో ఉంది.
పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంతో బిజీగా ఉండటంతో పవన్ సినిమాల షూటింగ్స్ ఆగిపోయాయి.ఓజీ సినిమా( OG Movie ) కూడా చెప్పిన డేట్ విడుదల కావడం అసాధ్యమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.పవన్ కళ్యాణ్ ఇతర భాషల్లో సైతం సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా హీరోగా సక్సెస్ సాధిస్తే ఫ్యాన్స్ సంతోషానికి అవధులు ఉండవని చెప్పవచ్చు.
పవన్ కళ్యాణ్ కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాల్సి ఉంది.