ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి.ఇప్పటికే ప్రధాన పార్టీలు వైసీపీ, ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోలు విడుదల చేయడం జరిగింది.
ఈసారి ఎన్నికలలో ఎవరు గెలుస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది.టీడీపీ-బీజేపీ-జనసేన పార్టీలు( TDP BJP Janasena ) కలిసి పోటీ చేస్తున్నాయి.
ఈ మూడు పార్టీల కూటమి గతంలో 2014లో గెలిచినట్టు ఈసారి గెలవాలని ప్లాన్.జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) పిఠాపురం ( Pithapuram )నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు.
ఈ ఎన్నికలలో ఎలాగైనా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాలని పవన్ భావిస్తున్నారు.

ఈ క్రమంలో ఇప్పటికే పవన్ కళ్యాణ్ గెలుపు కోసం తెలుగు ఇండస్ట్రీకి చెందిన అనేకమంది నటీనటులు పిఠాపురంలో ప్రచారం చేశారు.మెగా హీరో వరుణ్ తేజ్( Varun Tej ) కూడా ప్రచారంలో పాల్గొన్నారు.ఇదిలా ఉంటే సీనియర్ హీరోయిన్ ఖుష్బు( Khushbu ) తాజాగా ఏపీ రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి తరుపున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని వ్యాఖ్యానించారు.ఇదే సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.గతంలో పవన్ తో “అజ్ఞాతవాసి” సినిమా చేయడం జరిగింది.

ఆ సమయంలోనే ఆయన రాజకీయాల్లో ఉన్నారు.కానీ ఎప్పుడూ కూడా రాజకీయాల గురించి నా దగ్గర ప్రస్తావన తీసుకురాలేదు.త్వరలో నేను ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నాను.
బీజేపీతో( BJP ) పొత్తులో ఉన్నారు కాబట్టి పవన్ పిలిస్తే ఎక్కడికైనా వెళ్లి ప్రచారం చేస్తాను అని ఖుష్బు తెలియజేయడం జరిగింది.తమిళ రాజకీయాలలో బీజేపీ పార్టీలో ఖుష్బు రాణిస్తున్నారు.
ఒకపక్క సినిమాలు మరోపక్క రాజకీయాలు చేస్తూ బిజీగా గడుపుతున్నారు.ఈ క్రమంలో ఏపీ ఎన్నికలలో పవన్ తరఫున ప్రచారం చేస్తానని ఖుష్బు ప్రకటన చేయటం సంచలనంగా మారింది.