బిర్యానీ ఆకుతో ఇలా చేస్తే మీ దంతాలు తెల్ల‌గా, దృఢంగా మార‌తాయి!

బిర్యానీ ఆకు. దాదాపు అంద‌రి ఇళ్ల‌ల్లోనూ ఉండే కామ‌న్ మ‌సాలా ఇది.

 Doing This With Bay Leaves Will Make Your Teeth White And Stronger! ,bay Leaves,-TeluguStop.com

బిర్యానీ ఆకును బిర్యానీలో మాత్ర‌మే కాదు నాన్ వెజ్ వంట‌ల్లోనూ వినియోగిస్తుంటారు.వంట‌ల‌కు చ‌క్క‌టి రుచి, సువాసన అందించే బిర్యానీ ఆకులో ఎన్నో అమోఘ‌మైన పోష‌కాలు నిండి ఉంటాయి.

అవి మ‌న ఆరోగ్యానికి అనేక విధాలుగా ఉప‌యోగ‌ప‌డ‌తాయి.అంతేకాదండోయ్‌.

బిర్యానీ ఆకుతో మ‌న దంతాల‌ను తెల్ల‌గా, దృఢంగా కూడా మార్చుకోవ‌చ్చు.చాలా మంది త‌మ దంతాలు తెల్ల‌గా లేవ‌నో, బ‌ల‌హీనంగా మారాయ‌నో తెగ బాధ‌ప‌డుతూ ఉంటారు.

అలాంటి వారు బిర్యానీ ఆకుతో ఇప్పుడు చెప్ప‌బోయే విధంగా చేస్తే అద్భుత ఫ‌లితాలను సొంతం చేసుకోవ‌చ్చు.మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం అస‌లు మ్యాట‌ర్‌లోకి వెళ్లిపోదాం ప‌దండీ.ముందుగా మూడు నుండి నాలుగు బిర్యానీ ఆకుల‌ను తీసుకుని మిక్సీ జార్‌లో వేసి మెత్త‌గా పొడి చేసుకోవాలి.ఆ త‌ర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో వ‌న్ టేబుల్ స్పూన్ బిర్యానీ ఆకుల పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్‌, రెండు టేబుల్ స్పూన్ల ఆరెంజ్ జ్యూస్‌, రెండు టేబుల్ స్పూన్ల రెగ్యుల‌ర్ టూత్ పేస్ట్ వేసి అన్నీ క‌లిసే వ‌ర‌కు బాగా మిక్స్ చేయాలి.

Telugu Bay, Bay Teeth, Benefits Bay, Tips, Latest, Oral, Teeth-Telugu Health Tip

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని బ్ర‌ష్‌తో దంతాల‌ను ప‌ట్టించి సున్నితంగా రెండు నుంచి మూడు నిమిషాల పాటు తోముకోవాలి.ఆపై గోరు వెచ్చ‌ని నీటితో దంతాల‌ను, నోటిని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఇలా రోజుకు ఒక‌సారి చేస్తే.బిర్యానీ ఆకులో ఉండే కొన్ని ప్ర‌త్యేక‌మైన సుగుణాలు దంతాల‌ను ముత్యాల మాదిరి తెల్ల‌గా మెరిపించ‌డ‌మే కాదు దృఢంగా కూడా మారుస్తాయి.అంతేకాదు, బిర్యానీ ఆకుతో పైన చెప్పిన విధంగా బ్ర‌ష్ చేసుకుంటే చిగుళ్ల వాపు, చిగుళ్ల నుండి ర‌క్తం కావ‌డం వంటి స‌మ‌స్య‌లు సైతం దూరం అవుతాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube