సూపర్ స్టార్ మహేష్ తో దాదాపు పదేళ్లుగా సినిమా కోసం ప్రయత్నిస్తున్నాడు ఓ తమిళ దర్శకుడు.ఆయన స్వతహాగా తమిళ దర్శకుడే అయినా ఆయన తెలుగులో కూడా సినిమాలు చేస్తాడు.
అతనికి ఇక్కడ కూడా మంచి క్రేజ్ ఉంది.తెలుగు, తమిళంలో ఒకే సినిమాని వేరు వేరు స్టార్ కాస్ట్ తో చేయగలడు.
ఇంతకీ ఆ డైరక్టర్ ఎవరంటే తమిళ స్టార్ డైరక్టర్ గౌతం మీనన్ అని తెలుస్తుంది.తమిళంలో స్టార్ డైరక్టర్ అయిన గౌతం మీనన్ ఆయన చేసే ప్రతి సినిమా తెలుగులో కూడా రిలీజ్ చేస్తాడు.
అయితే ఈమధ్య సినిమాలను చేయని గౌతం మీనన్ దశాబ్ధ కాలంగా మహేష్ తో సినిమా చేయాలని అనుకుంటున్నా సరే అది కుదరట్లేదు.గౌతం మీనన్ సూపర్ ఫాం లో ఉన్న టైం లో మహేష్ కూడా అతనితో సినిమా చేయడానికి ఆసక్తిచూపించారు.
కానీ ఇప్పుడు మహేష్ గౌతం మీనన్ తో సినిమా అంటే పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు.అయితే గౌతం మీనన్ తీసిన సినిమాలు చాలా ఇంప్యాక్ట్ క్రియేట్ చేస్తాయి.
సరైన కథతో వస్తే మహేష్ ఇప్పటికైనా గౌతం మీనన్ ని యాక్సెప్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది.

అయితే అది ఖచ్చితంగా పాన్ ఇండియా స్టోరీ అయ్యి ఉండాలి.మహేష్ ఇప్పుడు త్రివిక్రం డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు.ఆ తర్వాత రాజమౌళి సినిమా ఉంది.
ఈ రెండు సినిమాల తర్వాతనే ఏ సినిమా అయినా ఉంటుంది.సో గౌతం మీనన్ సినిమా ఉన్నా సరే అది ఖచ్చితంగా మూడు నీలుగేళ్ల తర్వాతే సాధ్యమవుతుందని చెప్పొచ్చు.
గౌతం మీనన్ తీసిన కొన్ని సినిమాలు ఇప్పటికీ తెలుగు ఆడియెన్స్ కు సూపర్ ఫేవరేట్ గా ఉన్నాయి.మరి అతనితో మహేష్ సినిమా చేస్తే మాత్రం ఆ మూవీ రేంజ్ వేరేలా ఉంటుందని చెప్పొచ్చు.
.






