ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడం తెలిసిందే.ఈ క్రమంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు( Chandrababu Naidu ) బాధ్యతలు చేపట్టిన తర్వాత అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు.
ఒకపక్క ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ మరో ప్రక్క పాలనపరంగా ప్రక్షాళన చేసే దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.ఇప్పటికే మెగా డీఎస్సీకి సంబంధించిన నోటిఫికేషన్ పై సంతకం చేయడం జరిగింది.
అలాగే పెన్షన్ పెంపు, అన్నా క్యాంటీన్ ల పునరుద్ధరణ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు వంటి హామీలను నెరవేర్చే దిశగా అడుగులు వేయడం జరిగింది.
అంతేకాకుండా తెల్ల రేషన్ కార్డుదారులకు కందిపప్పు పంపిణీ జరిగేలా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది.ఈ రకంగానే తాజాగా వైసీపీ( YCP ) హయాంలో ప్రభుత్వ పథకాలకు పెట్టిన పేర్లను తొలగించి కొత్త పేర్లను పెట్టడం జరిగింది. వైయస్సార్ కళ్యాణమస్తుకి చంద్రన్న పెళ్లి కానుక, వైయస్సార్ విద్యోన్నతి పథకానికి ఎన్టీఆర్ విద్యోన్నతి, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాలకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్, జగనన్న విదేశీ విద్యా దీవెన పథకానికి అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి( Ambedkar Overseas Vidyanidhi ) అనే పేర్లు ఖరారు చేయడం జరిగింది.
ఈ మేరకు మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి( Dola Sree Bala Veeranjaneya Swamy ) అధికారులకు ఆదేశాలు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.