ఫిబ్రవరి 19వ తేదీన తిరుమలలో అనంతాళ్వారు 969వ అవతారోత్సవం..

శ్రీవైష్ణవ భక్తుడు ఆళ్వారులలో ప్రముఖుడైన శ్రీ అనంతాళ్వారు 969వ అవతార ఉత్సవాన్ని ఫిబ్రవరి 19వ తేదీన తిరుమలలోని శ్రీవారి దేవాలయానికి నైరుతి దిశగా ఉన్న పురుశైవారి తోటలో టీటీడీ ఎంతో వైభవంగా నిర్వహించనుంది.ఈ సందర్భంగా ఆళ్వార్‌ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో రచనలపై సదస్సు నిర్వహిస్తున్నారు.16 మంది పండితులు పాల్గొని ఉపన్యాసించనున్నారు.సాధారణంగా అనంతళ్వారు జననం చైత్రమాసంలో తమిళనాడులో సంభవించిన, తిరుమలలో ఆయన కాలు మోపిన దినాన్ని అవతారోత్సవంగా వారి వంశీయులు భావిస్తారు.

 969th Incarnation Of Ananthalwar In Tirumala On February 19. , Ananthalwar , Alw-TeluguStop.com

ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా మొత్తంగా స్థిరపడిన అనంతాళ్వారు వారి వంశీయులు పురశైవారి తోటలో కలిసి ప్రత్యేక పూజలు, దివ్యప్రబంధ, పాశుర పారాయణం, ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు.

పురాణాల ప్రకారం శ్రీ అనంతాళ్వారు సాక్షాత్తు ఆదిశేషుని రూపంగా మరో శ్రీ వైష్ణవ భక్తేశ్వరుడిగా శ్రీరామానుజాచార్యులతో కలిసి ఆవిర్భవించినట్లు తెలుస్తోంది.

పురాణాల ప్రకారం ఒకరోజు అనంతాళ్వారు నిండు గర్భిణీ అయినా తన భార్యతో కలిసి స్వామివారి దేవాలయం చెంత ఒక పూల తోటను ఏర్పాటు చేస్తుండగా బాలుని రూపంలో సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమయ్యారు తను కాదన్నా తన భార్యకు పనులలో చేదుడు వాదుడుగా ఉద్యానవన నిర్మాణం లో సహకరించాడని కోపంతో అనంతాళ్వారు ఆ బాలుడి పై తన చేతిలో ఉన్న గుణపాన్ని విసురుతాడు.

Telugu Alwardivya, Ananthalwar, Devotional, Tirumala-Latest News - Telugu

ఆ తర్వాతి రోజు స్వామివారి మూలవిరాట్ చుంబుకం నుంచి రక్తంస్రావం చూసి అతను చేసిన పొరపాటుకు పశ్చాత్తాపం చెందాడు.వెంటనే స్వామి వారి గాయానికి కర్పూరపు ముద్దను అంటించి తన అపార భక్తుని చాటుకున్నాడు.దాని తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి వారి కృపకు పాత్రుడయ్యాడు.

ఈ రోజుకి స్వామివారి చుంబుకానికి కర్పూరాన్ని అంటించడం అనంతాళ్వారు దివ్యగాథను స్ఫురింపజేస్తుంది.అదే విధంగా ఈ రోజుకి తిరుమల మహాద్వారం వద్ద అనంతాళ్వారు స్వామి వారి పై విసిరిన గుణపం కూడా భక్తులు చూస్తూ ఉంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube