బరువు తగ్గడానికి ట్రై చేస్తున్నారా.. అయితే దీన్ని తప్పక తీసుకోండి!

ఇటీవల రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ఎంతో మంది ఓవర్ వెయిట్( Over Weight ) సమస్యతో బాధపడుతున్నారు.శరీరం బ‌రువు అదుపు తప్పడానికి అనేక కారణాలు ఉన్నాయి.

 This Drink Helps To Lose Weight Quickly Details, Weight Lose Drink, Weight Lose-TeluguStop.com

ప్రధానంగా ఆహారపు అలవాట్లు, కంటినిండా నిద్ర లేకపోవడం, ఒత్తిడి, శరీరానికి శ్రమ లేకపోవడం, పలు దీర్ఘకాలిక వ్యాధులు వంటి అంశాలు బరువు పెరగడానికి కారణం అవుతుంటాయి.ఏదేమైనా కొందరు పెరిగిన బరువును తగ్గించుకునేందుకు చాలా ట్రై చేస్తూ ఉంటారు.

కఠినమైన డైట్ ఫాలో అవుతుంటారు.నిత్యం వ్యాయామాలు చేస్తుంటారు.

అయితే అలాంటి వారికి ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ ఎంతో ఉత్తమంగా సహాయపడుతుంది.ఈ డ్రింక్ మీరు బరువు తగ్గే ప్రక్రియను మరింత వేగవంతం చేస్తుంది.మిమ్మల్ని నాజూగ్గా మారుస్తుంది.మరి ఇంతకీ ఆ డ్రింక్ ఏంటి.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? అన్న విష‌యాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Biryani, Cumin Seeds, Fat Cutter, Tips, Latest, Metabolism, Lose, Lose Ti

ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోసుకోవాలి.వాటర్ కాస్త బాయిల్ అయ్యాక రెండు బిర్యానీ ఆకులు,( Biryani Leaves ) హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి,( Jeera Powder ) హాఫ్ టీ స్పూన్ సోంపు, వన్ టీ స్పూన్ అల్లం తురుము, మూడు లేదా నాలుగు లెమన్ స్లైసెస్ వేసుకొని మరిగించాలి.దాదాపు వాటర్ సగం అయ్యేంతవరకు హీట్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.ఇప్పుడు స్ట్రైనర్ సహాయంతో మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకుని గోరువెచ్చగా అయిన తర్వాత సేవించాలి.

Telugu Biryani, Cumin Seeds, Fat Cutter, Tips, Latest, Metabolism, Lose, Lose Ti

ఈ డ్రింక్ ను రోజుకు ఒకసారి కనుక తీసుకుంటే అదిరిపోయే రిజల్ట్ ను మీరు గమనిస్తారు.ఈ డ్రింక్ మెటబాలిజం రేటును( Metabolism Rate ) పెంచుతుంది.దాంతో శరీరంలో కేలరీలు మరింత వేగంగా బర్న్ అవుతాయి.అలాగే ఇప్పుడు చెప్పుకున్న డ్రింక్ ను తీసుకోవడం వల్ల అతి ఆకలి సమస్య దూరం అవుతుంది.ఒంట్లో పేరుకుపోయిన అదనపు కొవ్వు మొత్తం కరిగిపోతుంది.అదే సమయంలో ఈ డ్రింక్ బాడీని డీటాక్స్ చేస్తుంది.

శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతుంది.కాబట్టి మీరు మీ బరువు తగ్గే ప్రక్రియను వేగవంతం చేసుకోవాలి అనుకుంటే తప్పకుండా పైన చెప్పుకున్న డ్రింక్ ను డైట్ లో చేర్చుకోండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube